https://oktelugu.com/

నిమ్మగడ్డకు ఊహించని షాక్‌

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ-–వాచ్ యాప్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన కోర్టు లంచ్ మోషన్‌కు నిరాకరించి గురువారం విచారణ జరుపుతామని తెలిపింది. ఈ–-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్ అని.. ఎస్ఈసీ ఇంతకుముందు వాడే యాప్ స్థానంలో కొత్త యాప్ వాడుతున్నారని ప్రభుత్వం పిటిషన్‌లో ప్రస్తావించింది. యాప్‌ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం కోరింది. Also Read: ఏపీలో విద్యుత్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 3, 2021 / 01:40 PM IST
    Follow us on


    ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ-–వాచ్ యాప్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన కోర్టు లంచ్ మోషన్‌కు నిరాకరించి గురువారం విచారణ జరుపుతామని తెలిపింది. ఈ–-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్ అని.. ఎస్ఈసీ ఇంతకుముందు వాడే యాప్ స్థానంలో కొత్త యాప్ వాడుతున్నారని ప్రభుత్వం పిటిషన్‌లో ప్రస్తావించింది. యాప్‌ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం కోరింది.

    Also Read: ఏపీలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కాం..?

    ఏపీ ఎస్ఈసీ ఈ–వాచ్ పేరుతో కొత్త యాప్ తీసుకొచ్చింది. పాత యాప్ స్థానంలో కొత్తగా దీనిని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ యాప్‌ను నిమ్మగడ్డ రమేష్ ఆవిష్కరించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ప్రత్యేకంగా యాప్‌ తీసుకొస్తున్నట్లు ఎన్నికల కమిషనర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార నిమిత్తం ఏర్పాటుచేస్తున్న కాల్‌ సెంటర్‌ని కూడా ప్రారంభించారు. ఈ యాప్‌ను ప్రభుత్వం తప్పుబడుతోంది.

    Also Read: ఎస్‌ఈసీపై సభా హక్కుల ఉల్కంఘన చర్యలు సాధ్యమేనా..?

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఈ యాప్‌ను రూపొందించింది. ఈ–-వాచ్ పేరుతో రూపొందించిన ఈ యాప్‌ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర వివరాలు, సమాచారం కోసం యాప్‌ను రూపొందించినట్లు ఎస్ఈసీ వెల్లడించారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలతో పాటు ఫొటోలను కూడా అప్ లోడ్ చేసే అవకాశముందని తెలిపారు. ఎన్నికలను పారదర్శంగా నిర్వహించేందుకే యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. బలవంతపు ఏకగ్రీవాలు, దాడులను అరికట్టడమే ప్రధాన లక్ష్యం కూడా. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, ఓటర్లకు పటిష్ట భద్రతను ఈ యాప్ ద్వారా కల్పిస్తున్నామన్నారు. యాప్ కు తోడు ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామన్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్