https://oktelugu.com/

రైతుల ఆందోళనపై 15 గంటల చర్చ

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరుగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో చర్చ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సభలో రెండురోజుల నుంచి తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఈ క్రమంలో రాజ్యసభలో బుధవారం నెలకొన్న గందరగోళం అనంతరం కేంద్ర ప్రభుత్వం.. విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. Also Read: నావల్నీకి రెండేళ్ల జైలు శిక్ష బుధవారం […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 3, 2021 / 01:52 PM IST
    Follow us on


    దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరుగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో చర్చ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సభలో రెండురోజుల నుంచి తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఈ క్రమంలో రాజ్యసభలో బుధవారం నెలకొన్న గందరగోళం అనంతరం కేంద్ర ప్రభుత్వం.. విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

    Also Read: నావల్నీకి రెండేళ్ల జైలు శిక్ష

    బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టబట్టాయి. ఈ అంశంపై కనీసం 5 గంటల పాటు సభలో ఏకధాటిగా చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్‌ చేయగా.. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ స్పందించారు. ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తుందని దీనిపై 15 గంటల పాటు చర్చిద్దామని ప్రకటించారు.

    అనంతరం కాంగ్రెస్‌ పక్షనేత గులాం నబీ ఆజాద్‌ తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాజ్యసభలో 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పరస్పరం అంగీకారం కుదిరిన నేపథ్యంలో ఈ అంశంపై సుధీర్ఘంగా చర్చ జరిగే అవకాశముంది.అయితే.. రైతుల అంశంపై చర్చకు అదనపు సమయం కేటాయించడం కోసం బుధ, గురువారాల్లో ప్రశ్నోత్తరాల గంటలను, గురువారం శూన్య గంటను ఎత్తివేస్తున్నట్లు ప్రహ్లాద్‌ జోషీ చెప్పారు. దీంతోపాటు శుక్రవారం ఉన్న బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ, ప్రైవేటు మెంబర్‌‌ బిల్లు సమయాలను కూడా చర్చకే వినియోగించనున్నట్లు చెప్పారు.

    Also Read: అధ్యక్ష పీఠం కోసమే ఆ తిరుగుబాటా..?

    ఇదిలా ఉండగా.. రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక దశలో అసహనానికి గురైన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, ముగ్గురు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలను సభ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేశారు. ‘రైతుల ఆందోళనకు చర్చల కోసం సమయం కేటాయించాం. అయినప్పటికీ నిరసన చేయడం సరికాదు. నా సహనాన్ని పరీక్షిస్తే మిమ్మల్ని రోజంతా సస్పెండ్‌ చేయాల్సి ఉంటుంది’ అని సభ్యులను హెచ్చరించారు. అనంతరం ఆప్‌ ఎంపీలను సభ నుంచి బయటకు పంపించేశారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్