Homeఆంధ్రప్రదేశ్‌AP high Court: మరోసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆన్ లైన్ టికెట్ల...

AP high Court: మరోసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆన్ లైన్ టికెట్ల విషయంలో..

AP high Court: ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల ర‌చ్చ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ విష‌యంలో హైకోర్టు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. టికెట్ ధరల అంశంపై హైకోర్టులో విచారణ నేప‌థ్యంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌న్హ‌రం. ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు క‌రెక్ట్ కావ‌ని చుర‌క‌లంటించింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం లేదంటూ తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది లైసెన్సింగ్‌ అథారిటీ మాత్రమేనని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వానికి కేవ‌లం సూచ‌న‌లు చేసే అధికారం మాత్ర‌మే ఉందని గుర్తుచేసింది.

AP high Court
AP high Court

అయితే మల్టీఫ్లెక్స్‌లలో వసూలు చేసే సర్వీసే చార్జీలను సినిమా టికెట్లలో చేరుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న జారీ చేసిన జీవో 13ను సవాల్‌ చేస్తూ మల్టీఫ్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తరఫున ఫరీద్‌ బిన్‌ అవద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెప‌థ్యంలో హైకోర్టు ఈ ధంగా వ్యాఖ్య‌లు చేసింది. ఆన్లైన్ సినిమా టికెట్లు అమ్మెట‌ప్పుడు సర్వీస్ ఛార్జీలను ధరల్లో కలప‌డానికి వీలు లేదని స్పష్టం చేసింది. పాత విధానంలో టికెట్లను నిర్ణయించుకోవచ్చు అని మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు తెలిపింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం ద్వారా నిధులు దుర్వినియోగం అవుతాయని ఆందోళన అవసరం లేదని తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్‌ 15కి వాయిదా వేసింది.

Also Read: CM Jagan Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. ప్రణాళికలు సిద్ధం చేసిన సీఎం జగన్

అయితే ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ ధరలు, అదనపు షోలకు పర్మిషన్ల వంటి అంశాలపై ఇష్యూ కాగా సినిమా బడ్జెట్, ఏపీలో షూటింగ్ జరుపుకున్న సినిమాల వారీగా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారిగా థియేటర్లలోని సౌకర్యాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేస‌థ్యంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్ర‌భుత్వానిక ఎలాంటి అధికారం లేద‌ని క్లియ‌ర్ చెప్పింది. థియేటర్లలో క్యూలో నిలబడి టికెట్ కొనుగోలు చేసే అవసరం లేకుండా ఆన్ లైన్లో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని.. ఇందులో సర్వీస్ ఛార్జీని టికెట్ ధరలో కలపడానికి వీల్లేదని పిటిషనర్ వాద‌న‌.

AP high Court
AP high Court

టిక్కెట్‌ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాలను భాగస్వాములను చేయలేద‌ని గుర్తుచేసింది. టికెట్‌ ధరలు నిర్ణయించే విషయంలో సంప్రదించినట్లు గానీ, అభ్యంతరాలు స్వీకరించినట్లు గానీ ఎలాంటి ఆధారాలను కోర్టుకు సమర్పించలేద‌ని వ్యాఖ్యానించింది. పిటిష‌న‌ర్లను సంప్ర‌దించకుండా స‌ర్వీస్ చార్టీల విష‌యంలో సొంత నిర్ణయాలు తీసుకోవ‌డానికి వీల్లేద‌ని స్పష్టం చేసింది.

Also Read:Minister Roja: మిస్సయిన మంత్రి రోజా సెల్ ఫోన్. గంటల్లోనే గుర్తింపు.. మంత్రా మజాకా

Recommended Videos:

Actress Kajal Aggarwal Son Name || Gautam Kitchlu Announced Baby Boy Name || Oktelugu Entertainment

Balayya Heroine Sonal Chauhan seen at Mumbai Airport Arrivals || Oktelugu Entertainment

Ram Charan Shares A Funny Fight Between His Mother and Grand Mother || Oktelugu Entertainment

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version