AP high Court: ఏపీలో సినిమా టికెట్ల ధరల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. టికెట్ ధరల అంశంపై హైకోర్టులో విచారణ నేపథ్యంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం గమన్హరం. ప్రభుత్వ నిర్ణయాలు కరెక్ట్ కావని చురకలంటించింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం లేదంటూ తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది లైసెన్సింగ్ అథారిటీ మాత్రమేనని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కేవలం సూచనలు చేసే అధికారం మాత్రమే ఉందని గుర్తుచేసింది.
అయితే మల్టీఫ్లెక్స్‌లలో వసూలు చేసే సర్వీసే చార్జీలను సినిమా టికెట్లలో చేరుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న జారీ చేసిన జీవో 13ను సవాల్ చేస్తూ మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఫరీద్ బిన్ అవద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెపథ్యంలో హైకోర్టు ఈ ధంగా వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ సినిమా టికెట్లు అమ్మెటప్పుడు సర్వీస్ ఛార్జీలను ధరల్లో కలపడానికి వీలు లేదని స్పష్టం చేసింది. పాత విధానంలో టికెట్లను నిర్ణయించుకోవచ్చు అని మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు తెలిపింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆన్‌లైన్ టికెట్ విధానం ద్వారా నిధులు దుర్వినియోగం అవుతాయని ఆందోళన అవసరం లేదని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్ 15కి వాయిదా వేసింది.
Also Read: CM Jagan Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. ప్రణాళికలు సిద్ధం చేసిన సీఎం జగన్
అయితే ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ ధరలు, అదనపు షోలకు పర్మిషన్ల వంటి అంశాలపై ఇష్యూ కాగా సినిమా బడ్జెట్, ఏపీలో షూటింగ్ జరుపుకున్న సినిమాల వారీగా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారిగా థియేటర్లలోని సౌకర్యాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేసథ్యంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానిక ఎలాంటి అధికారం లేదని క్లియర్ చెప్పింది. థియేటర్లలో క్యూలో నిలబడి టికెట్ కొనుగోలు చేసే అవసరం లేకుండా ఆన్ లైన్లో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని.. ఇందులో సర్వీస్ ఛార్జీని టికెట్ ధరలో కలపడానికి వీల్లేదని పిటిషనర్ వాదన.
టిక్కెట్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలను భాగస్వాములను చేయలేదని గుర్తుచేసింది. టికెట్ ధరలు నిర్ణయించే విషయంలో సంప్రదించినట్లు గానీ, అభ్యంతరాలు స్వీకరించినట్లు గానీ ఎలాంటి ఆధారాలను కోర్టుకు సమర్పించలేదని వ్యాఖ్యానించింది. పిటిషనర్లను సంప్రదించకుండా సర్వీస్ చార్టీల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
Also Read:Minister Roja: మిస్సయిన మంత్రి రోజా సెల్ ఫోన్. గంటల్లోనే గుర్తింపు.. మంత్రా మజాకా
Recommended Videos: