https://oktelugu.com/

Bigg Boss OTT: బిందుమాధవి ఓట్లన్నీ అతడికే.. ఈసారి అఖిల్ కు భారీ దెబ్బ? ఎలిమినేట్ ఎవరంటే?

Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ షో విశేష ప్రేక్షకాదరణతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే సగం వరకూ పూర్తయ్యి మిగతా సగం ఉత్కంఠ రేపుతోంది. కఠినమైన ప్రత్యర్థుల నడుమ నువ్వా నేనా అన్నట్టుగా షో రక్తి కడుతోంది. బాబా భాస్కర్ ఎంట్రీతో షో మలుపు తిరిగింది. ఇందులో ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేషన్స్ సాగుతుండడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో 8వ వారం ఓటింగ్ అత్యంత ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే 17మందితో బిగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 21, 2022 / 04:41 PM IST
    Follow us on

    Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ షో విశేష ప్రేక్షకాదరణతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే సగం వరకూ పూర్తయ్యి మిగతా సగం ఉత్కంఠ రేపుతోంది. కఠినమైన ప్రత్యర్థుల నడుమ నువ్వా నేనా అన్నట్టుగా షో రక్తి కడుతోంది. బాబా భాస్కర్ ఎంట్రీతో షో మలుపు తిరిగింది. ఇందులో ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేషన్స్ సాగుతుండడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో 8వ వారం ఓటింగ్ అత్యంత ఆసక్తి రేపుతోంది.

    Bigg Boss OTT

    ఇప్పటికే 17మందితో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలు కాగా.. ఏడు వారాలకు గాను ఏడుగురు బయటకు వెళ్లారు. ముమైత్, శ్రీరాపాక, ఆర్జే చైతూ,సరయూ, తేజస్వి, స్రవంతి, మహేష్ విట్టాలు ఎలిమినేట్ అయిపోయారు. ఈ 8వ వారం బిందు, అఖిల్, అజయ్, ఆషు, హమీద, అనిల్ నామినేట్ అయ్యారు. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్, మూడో సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.వస్తూనే తనకు లబించిన ఓ పవర్ తో నామినేట్ అయిన ‘బిందుమాధవి’ని సేవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

    దీంతో ప్రస్తుతం 8వ వారం నామినేషన్స్ లో ఐదుగురు మాత్రమే నామినేట్ అయ్యారు. అఖిల్, అజయ్, ఆషురెడ్డి, హమీద, అనిల్ రాథోడ్ లలో ఒకరు ఈవారం ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

    Also Read: Vijayasai Reddy: ప్రమోషనా.. డిమోషనా? వైసీపీలో విజయసాయి స్థానం ఏంటి?

    8వ వారం ఓటింగ్ హోరాహోరీగా జరుగుతోంది. టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తున్న బిందుమాధవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె స్నేహితుడైన శివ ఈ వారం కెప్టెన్ కావడంతో నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలోనే బిందుకు మరో మద్దతుదారుగా ఉన్న ‘అనిల్ రాథోడ్’కు ఆమె తరుఫున ఉన్న భారీ ఫ్యాన్స్ ఓట్ల వర్షం కురిపిస్తున్నారట.. అతడే ఈ వారం టాప్ లో ఉన్నాడని సమాచారం.

    ఇక బిందు తర్వాత టైటిల్ ఫేవరెట్ గా ఉన్న అఖిల్ ఈసారి బిందు ఫ్యాన్స్ ధాటికి రెండో స్థానానికి పరిమితం అయినట్టు ఓటింగ్ ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది.

    ఈ వారం ఓటింగ్ ట్రెండ్ చూస్తే.. బిందుమాధవి ఫ్యాన్స్ ఓట్ల వర్షం కురిపిస్తుండడంతో ఆమె స్నేహితుడైన అనిల్ టాప్ లో కొనసాగుతున్నాడు. ఇక అఖిల్ రెండోస్థానంలో హమీదా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫలితంగా అఖిల్ బ్యాచ్ కు చెందిన ఆషురెడ్డి, అజయ్ నాలుగు, ఐదోస్థానాల్లోకి దిగజారారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం. దీంతో బిందు మాధవి దెబ్బకు అఖిల్ బ్యాచ్ చెల్లాచెదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

    Also Read: Samantha Second Marriage: రెండవ పెళ్లి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సమంత

    Recommended Videos: