Homeఆంధ్రప్రదేశ్‌Ganesh Festivel In AP: ఏపీలో గణేష్ ఉత్సవాలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

Ganesh Festivel In AP: ఏపీలో గణేష్ ఉత్సవాలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

ap high court green signal to ganesh chaturthi celebrations with five people : ఏపీలో కరోనా.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హిందువుల ఆరాధ్య పండుగ అయిన గణేష్ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అందరూ ఇంట్లోనే పండుగను చేసుకోవాలని.. ఈసారి బహిరంగ మండపాలను వేసుకోవద్దని ఆదేశించింది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్ష బీజేపీ, టీడీపీ.. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొన్నిరోజులుగా ఏపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై ఎదురుదాడికి దిగుతోంది. ఏపీలో రాజకీయ వేడి రగులుకుంది. ఈ క్రమంలోనే గణేష్ ఉత్సవాల వివాదం హైకోర్టుకు ఎక్కింది. గణేష్ ఉత్సవాలపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో గణేష్ ఉత్సవాలకు అనుమతి మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని షరతులు పెట్టింది. పరిమితమైన సంఖ్యతో ఈ ఉత్సవాల నిర్వహణకు అభ్యంతరాలు లేవని హైకోర్టు ప్రకటించింది.

గణేష్ మండపాల వద్ద కరోనా నిబంధనలకు లోబడి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించిన హైకోర్టు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఏపీలో బహిరంగ స్థలాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. ప్రైవేటు స్థలాల్లో మాత్రమే ఉత్సవాలు నిర్వహించాలని.. పరిమిత భక్తులతో నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో ఇప్పటివరకూ పూర్తిగా కొనసాగుతున్న ఆంక్షలపై కొంత ఊరట దక్కినట్టైంది.

హైకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి షాక్ లా మారగా.. ప్రతిపక్ష బీజేపీ, టీడీపీ , జనసేన మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హైకోర్టు పూర్తి స్థాయిలో ఆంక్షల సడలింపులకు అంగీకరించలేదు. ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ఈ మేరకు గణేష్ మండపాల్లో ఉత్సవాల నిర్వహణకు బీజేపీ నేతలు సిద్దమవుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version