Afghan effect: అప్ఘన్ ఎఫెక్ట్: ఢిల్లీలో ఇండియా, రష్యా రహస్య చర్చలు

Afghan effect: అఫ్గనిస్తాన్ లో పరిణామాలపై భారత్ ఆందోళన చెందుతోంది. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది. తాలిబన్లు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంతో భారత్ కు చిక్కులు తప్పవని భావించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తాజా పరిణామాలపై చర్చించేందుకు భారత్ ఆహ్వానం మేరకు అమెరికా, రష్యాకు చెందిన కీలక అధికారుల బృందం భారత్ చేరుకుంది. రష్యా భద్రతా సలహాదాు మన భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పాటు ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఇందులో […]

Written By: Srinivas, Updated On : September 8, 2021 6:29 pm
Follow us on

Afghan effect: అఫ్గనిస్తాన్ లో పరిణామాలపై భారత్ ఆందోళన చెందుతోంది. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది. తాలిబన్లు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంతో భారత్ కు చిక్కులు తప్పవని భావించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తాజా పరిణామాలపై చర్చించేందుకు భారత్ ఆహ్వానం మేరకు అమెరికా, రష్యాకు చెందిన కీలక అధికారుల బృందం భారత్ చేరుకుంది. రష్యా భద్రతా సలహాదాు మన భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పాటు ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఇందులో సీఐఏ చీఫ్ కూడా ఉండనున్నారు.

అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ప్రకటన చేసింది. ప్రధానమంత్రిగా ముల్లా హసన్, డిప్యూటీగా ముల్లా బరాదర్ కు అవకాశం రానుంది. దీంతో అమెరికా మోస్ట్ వాంటెడ్ గా ఉన్న హక్కానీ నెల్ వర్క్ నేత సిరాజుద్దీన్ హక్కానీ సహా 33 మందితో తాలిబన్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. దీంతో భారత్ లో ఆందోళన నెలకొంది. అఫ్గన్ లో తాలిబన్లు అధికారం చేపడితే భారత్ కు ఏర్పడబోయే ఇబ్బందుల గురించి ఇప్పటి నుంచే కంగారు పడుతోంది. అఫ్గాన్ లో ఏర్పడే పరిణామాలు భారత్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

పంజ్ షేర్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో భారత్ ఆందోళన మరింత పెరిగింది. తాలిబన్లు భారత్ పై వ్యతిరేకతతోనే ఉంటారని భావించిన దేశం మిత్ర దేశాలైన అమెరికా, రష్యాకు చెందిన కీలక అధికారుల్ని చర్చలకు ఆహ్వానించింది. దీంతో రష్యా జాతీయ భద్రతా సలహాదాుతో పాటు అమెరికా సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.

ప్రస్తుతం రష్యా నేరుగా తాలిబన్ల సర్కారులో జోక్యం చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా తాలిబన్ల సర్కారుకు మద్దతు ఇస్తోంది. కానీ అంతర్జాతీయ స్థాయిలో అఫ్గనిస్తాన్ పరిణామాల్ని నిర్ణయించే స్థాయిలో అమెరికా, రష్యా ఉన్నాయని భారత్ భావిస్తోంది. తాలిబన్లత సత్సంబంధాలు కొనసాగిస్తూనే రష్యా సలహా కోరుతోంది. భారత్, రష్యా, చైనా, కలిసి అమెరికా లేని అఫ్గనిస్తాన్ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని భావిస్తోంది.

అఫ్గనిస్తాన్ లో తాజా పరిణామాల ప్రభావంతో అక్కడ ఏర్పాటయ్యే తాలిబన్ల సర్కారుతో ఎలా వ్యవహరించాలనే దానిపై భారత్ కీలక నిర్ణయం తీసుకునే ముందు అక్కడ పరిణామాల్లో భాగస్వాములుగా ఉన్న అమెరికా, రష్యా, చైనాలన సంప్రదించి అడుగులు వేయాలని ఆలోచిస్తోంది. అందుకే త్వరలో జరిగే స్కో, క్వాడ్ ఆవిర్భావ కార్యక్రమానికి మోడీ హాజరై అఫ్గన్ పరిణామాలపై వారితో చర్చించే అవకాశముంది. సెప్టెంబర్ 16న జరిగే స్కో మీటింగ్ లో వర్చువల్ గా మోడీ పాల్గొననున్నారు. 24న క్వాడ్ సమావేశానికి మాత్రం అమెరికా వెళ్లనున్నారు. ఇందులో రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్ పింగ్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.