
Corona Third Wave: కరోనా ముప్పు ప్రజలను ఎంతగా అతలాకుతలం చేసిందో తెలిసిందే. దాని ప్రభావంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మొదటి దశలో వృద్ధులను, రెండో దశలో యువకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. వైరస్ తో పోరాడిన వ్యక్తులలో ఎక్కువ శాతం మంది ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. కరోనా ప్రభావంతో ప్రజల్లో ఇమ్యూనిటీ శక్తి పెరిగింది. సమస్యలు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాల్సిందే. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కరోనా సోకితే కష్టమే. దీంతో వారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక కోవిడ్ ఉన్న వారికి అనారోగ్ం, నిరాశ, ఆందోళన, నిద్ర రుగ్మతలు, కీళ్ల నొప్పులు వంటి బాధలు కలగవచ్చు.
కరోనా నుంచి ప్రాణాలతో బయటపడిన వారు మరింత ముందస్తు ముందుచూపుతో వ్యవహరించాలి. మూడో దశ ఎంత ప్రమాదకరమైనదో ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. రోగనిరోధక శక్తి క్షీణిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోగ నిరోధక శక్తి లేనివారు ఆరోగ్య సమస్యలతో పోరాడుతన్న వారు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉండడంతో సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.
వైరస్ నుంచి కోలుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ టీకాలు వేయించుకోవాలి. దీర్ఘకాలిక కొవిడ్ కు క్లినికల్ నివారణ లేనప్పటికి టీకా నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. టీకాలు వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇటీవల కోలుకున్న రోగులు ఆరోగ్యం కుదుట పడేందుకు చొరవ తీసుకోవాలి.
కొవిడ్ బాధితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఒకటి, రెండు దశల్లో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. అత్యంత దయనీయ పరిస్థితిలో ఆక్సిజన్ అందని పరిస్థితిలో చాలా మంది మరణించినట్లు తెలుస్తోంది. కొవిడ్ ముప్పును తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మూడో దశ ముప్పు తొలగించుకోవాలంటే ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు.