AP MPTC ZPTC Election Result: ఏపీలోని కొలువుదీరిన జగన్ సర్కార్ కు భారీ ఊరట లభించింది. స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధుల కొరత తీరనుంది. ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గొప్ప శుభవార్త చెప్పింది.
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను జగన్ సర్కార్ ఏప్రిల్ లో నిర్వహించింది. అయితే వాటి ఫలితాలను వెలువరించకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. పోలింగ్ తేదికి 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని పరిషత్ ఎన్నికలపై గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం 10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసేలా ఆగమాగం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చి కేవలం వారానికే ఏప్రిల్ 7న పరిషత్ ఎన్నికలు నిర్వహించింది. పోలింగ్ కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వలేదు.దీనిపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.
గత ఏడాది ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించలేదని.. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ , ఎన్నికల్లో పోటీచేసిన కొందరు హైకోర్టులో అప్పీల్ చేశారు.
మే 21న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపింది. తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. ఇవాళ తాజాగా తీర్పునిచ్చింది. ఎన్నికల కౌంటింగ్ చేసి ఫలితాలు వెల్లడించాలని కోరింది.