https://oktelugu.com/

హైకోర్టు సంచలనం.. ఆనందయ్య మందుపై విచారణ

కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టు అనుమతించింది. గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు అనే వ్యక్తి ఆనందయ్య మందు పంపిణీపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పిటిషనర్లు కోరారు. లోకాయుక్త ఆదేశంలో పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదని, మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని పిటిషనర్లు చెబుతున్నారు. కరోనాతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 25, 2021 7:01 pm
    high court
    Follow us on

    corona medicine
    కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టు అనుమతించింది. గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు అనే వ్యక్తి ఆనందయ్య మందు పంపిణీపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పిటిషనర్లు కోరారు.

    లోకాయుక్త ఆదేశంలో పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదని, మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని పిటిషనర్లు చెబుతున్నారు.

    కరోనాతో బాధపడుతున్న వారు హఠాత్తుగా మందు పంపిణీ నిలిపివేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.

    మంగళవారం టీడీపీ బృందం సైతం ఆనందయ్య మందు పంపిణీని పరిశీలించింది. వారి ముందే ఓ బాలుడికి మందు వేయగా అతను లేచి కూర్చోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని వారు సీఎం జగన్ ను కోరారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మందు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు.