Site icon OkTelugu

తెలంగాణ సర్కార్ కి జూడాల షాక్

తెలంగాణ సర్కార్ కి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగతా వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు తేల్చి చెప్పారు. జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. జూడాలకు బీమా సౌకర్యంతోపాటు, తమ కుటుంబ సభ్యులకు నిమ్స్ లో కరోనా వైద్యం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version