పాక్ లో చైనా టీకా తయారీ

చైనా తన వ్యాక్సిన్ వినియోగాన్ని పాకిస్థాన్ లో విస్తరిస్తోంది. తాజాగా చైనా కాన్ సినో కొవిడ్ -19 పాకిస్థాన్  టీకా తయారీని పాకిస్థాన్ ప్రారంభించింది. ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. పాకిస్థాన్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో ఈ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ ను ఏప్రిల్ లో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో నెలకు 30 లక్షల టీకాలను తయారు చేయనున్నారు. దీంతో పాకిస్తాన్ టీకా దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. […]

Written By: Suresh, Updated On : May 25, 2021 6:51 pm
Follow us on

చైనా తన వ్యాక్సిన్ వినియోగాన్ని పాకిస్థాన్ లో విస్తరిస్తోంది. తాజాగా చైనా కాన్ సినో కొవిడ్ -19 పాకిస్థాన్  టీకా తయారీని పాకిస్థాన్ ప్రారంభించింది. ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. పాకిస్థాన్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో ఈ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ ను ఏప్రిల్ లో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో నెలకు 30 లక్షల టీకాలను తయారు చేయనున్నారు. దీంతో పాకిస్తాన్ టీకా దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మే నెల చివరి నాటికి టీకాల మొదటి బ్యాచ్ అందుబాటులోకి రానుంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు ఫైసల్ సుల్తాన్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. తమ కొవిడ్ టీకాల అవసరాలను ఇది భారీగా తీరుస్తుందని పేర్కొన్నారు.