చలికాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో రేగుపండ్లు ఒకటనే సంగతి తెలిసిందే. ఈ కాలంలో దొరికే రేగు పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పుల్లగా, తియ్యగా ఉండే రేగు పండ్లలో అనేక మినరల్స్ ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పండ్లు సహాయపడతాయి. భారతదేశంలో 90 రకాల రేగు పండ్లు పండుతున్నాయి. ఈ పండ్లతో పాటు పండ్ల గింజల వల్ల కూడా ప్రయోజనాలు చేకూరుతాయి.
Also Read: టమోటాలు తింటే ఆ సమస్య వస్తుందని ప్రచారం.. నిజమేనా?
రేగు పండ్ల గింజలను పొడి చేసి నూనెతో కలిసి రాసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు. దేశంలోని పలు ప్రాంతాల్లో రేగు పండ్ల గుజ్జును వడియాలుగా కూడా తీసుకుంటారు. నీళ్లలో రేగు పండ్ల చెట్టు బెరడును మరిగించి డికాషన్ గా తీసుకుంటే విరేచనాల సమస్య దూరమవుతుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న రేగు పండ్లు మెదడును షార్ప్ గా ఉంచడంలో సహాయపడతాయి. మెదడు బాగా పని చేయడానికి రేగు పండ్లు ఉపకరిస్తాయి.
Also Read: సపోటా పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
జ్వరం మరియు ఫ్లూ సమస్యలను నివారించడంలో రేగు పండ్లు సహాయపడతాయి. కురుపులు వచ్చిన చోట రేగు ఆకులను తీసుకుని రాసుకుంటే అవి త్వరగా నయమవుతాయి. హెర్బల్ మందుగా పని చేసే రేగు పండ్లు వాతము, కఫము, పైత్యములను నివారించడంలో సహాయపడతాయి. శరీరానికి శక్తిని ఇవ్వడంలో, బరువు పెరగడంలో రేగు పండ్లు ఉపయోగపడతాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
కాలేయం చురుకుగా పని చేసేలా చేయడంలో రేగు పండ్లు సహాయపడతాయి. రేగు పండ్లలో కొవ్వు ఉండదు కాబట్టి ఈ పండ్లు ఎన్ని తీసుకున్నా బరువు పెరగరు. శరీరానికి కావాల్సిన 24 అమైనో ఆమ్లాలలో 18 అమైనో ఆమ్లాలు రేగు పండ్ల ద్వారానే లభిస్తాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పండ్లను తీసుకోవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు.