మూడు రాజధానుల వ్యవహారంలో న్యాయపరంగా వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే రాజధాని తరలింపు, నిపుణుల కమిటీ, హైపర్ కమిటీ, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లపై విచారణ చేసిన హై కోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అమరావతిలో రాజధాని నిర్మాణం మధ్యలో నిలిపివేసి మరొ చోటికి తరలించడం వల్ల ప్రజాధనం వృదా అవుతుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని కీలక వ్యాఖ్యలను ధర్మాసనం చేసింది. ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో రూ.52 వేల కోట్లకు సంబంధించిన పనులు చేపట్టినట్లు సీఆర్డీఏ దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్ లో పేర్కొంది. ఇందుకు సంబంధించి ఏఏ నిర్మాణాలకు ఎంత ఖర్చు చేశారో న్యాయస్థానానికి వివరాలు సమర్పించాలని సీఆర్డీఏను ధర్మాసనం ఆదేశించింది.
Also Read: చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..!
ప్రభుత్వ ఖజనాకు వేల రూ.వేల కోట్లు నష్టం వాటిల్లుతుంటే చూస్తూ ఎలా ఉందేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తిలు ఉన్నారు. ప్రజాధనాన్ని ఈ విధంగా వృదా చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు, నిపుణుల కమిటీ, హైపర్ కమిటీ వంటి అంశాలలో ఇప్పటి వరకూ సుమారు 35 పిటీషన్ లు దాఖలైనట్లు సమాచారం. ఈ పిటీషన్లను అన్నింటినిపై ఈ నెల 14వ తేదీన తదుపరి విచారణ నిర్వహించాలని హై కోర్టు ధర్మాసనం నిర్ణయించింది. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై కౌంటర్ దాఖలు చేస్తామని న్యాయస్థానానికి విన్నవించింది. 14వ తేదీ నాటికి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటనే అంశంలో క్లారిటీ రానుంది. అకౌంటెంట్ జనరల్ ను ప్రతివాదిగా చేయాలని దాఖలైన పిటీషన్ ను వచ్చే విచారణకు తమ ముందు ఉంచాలని ధర్మాసనం న్యాయస్ధానం అధికారులను ఆదేశించింది.
Also Read: మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం నిర్ణయమిదే?
మరోవైపు మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తమకు సంబంధం లేదని చేతులు దులుపేసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి ఒక రకంగా కలిసి వచ్చే అంశమే. అయితే న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులను ఎదుర్కొవడమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాల్ గా భావించాలి. ఇది కేవలం రాజధాని రైతులు, అమరావతి ప్రాంత ప్రజలకు మాత్రమే సంబంధించిన అంశమే కాకుండా ఆర్దిక, చట్టపరమైన అంశాలు ఇమిడి ఉన్నందున ఒకటి… రెండు రోజుల్లో తేలే వ్యవహారం కాదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అంశం తమ పరిధిలో లేని అంశం అని కేంద్రం కౌంటర్ దాఖలు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ లు దాఖలు చేసేందుకు పలువురు సిద్ధమయ్యారు. ఈ పిటీషన్ లు నేడో.. రేపో హై కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది.