ఈనాడు రామోజీరావుకు షాక్ తగలనుందా?

చరిత్ర కనివీనీ ఎరుగని కరోనా ఉత్పాతానికి అన్ని సంస్థలు విలవిలలాడుతున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లుగా నిర్మించుకున్న సామ్రాజ్యాలు కూలిపోతుండడంతో నిస్సహాయంగా చూస్తూ ఉన్నాడు ఆ మీడియా టైకూన్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు. ఇప్పుడు ఆయన తన పత్రికను నడిపించలేక ఉద్యోగులను సాగనంపుతున్న వైనం చర్చనీయాంశమవుతోంది. Also Read: ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తప్పవా? అయితే ఎప్పుడు పవర్ ఫుల్ గా ఉండే రామోజీకి ఉద్యోగుల తీసివేతతో కష్టాలు వచ్చిపడ్డాయి. వారు నిరసనలు తెలుపడం.. అవి మీడియాలో […]

Written By: NARESH, Updated On : August 7, 2020 1:51 pm
Follow us on


చరిత్ర కనివీనీ ఎరుగని కరోనా ఉత్పాతానికి అన్ని సంస్థలు విలవిలలాడుతున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లుగా నిర్మించుకున్న సామ్రాజ్యాలు కూలిపోతుండడంతో నిస్సహాయంగా చూస్తూ ఉన్నాడు ఆ మీడియా టైకూన్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు. ఇప్పుడు ఆయన తన పత్రికను నడిపించలేక ఉద్యోగులను సాగనంపుతున్న వైనం చర్చనీయాంశమవుతోంది.

Also Read: ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తప్పవా?

అయితే ఎప్పుడు పవర్ ఫుల్ గా ఉండే రామోజీకి ఉద్యోగుల తీసివేతతో కష్టాలు వచ్చిపడ్డాయి. వారు నిరసనలు తెలుపడం.. అవి మీడియాలో రావడంతో రామోజీ రావు ప్రతిష్ట మసకబారుతోంది.

తాజాగా ఈనాడులో తొలగించిన 400 మంది ఉద్యోగులు పోరుబాట పట్టడం ఆ సంస్థకు, అధినేతకు మింగుడు పడని అంశంగా మారిందట.. ఆ 400 మంది ఉద్యోగులు ఈనాడు సంస్థల ముందుతోపాటు రామోజీరావు స్వగ్రామంలో నిరసనకు ప్లాన్ చేయడం శరాఘాతంగా మారిందని సమాచారం. తాజాగా ఈనాడులో వేటుపడ్డ ఉద్యోగులందరూ నిరసనకు ప్లాన్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రచారం చేసుకుంటున్నారు.

ఈ 400 మంది ఉద్యోగులు రామోజీరావు స్వస్థలమైన కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో ఈనెల 13న భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటనలు విడుదల చేయడం గమనార్హం. అంతకుముందు రోజు హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయం ఎదుట తీసేసిన ఉద్యోగులంతా నిరసన చేపట్టాలని ప్లాన్ చేశారట..

Also Read: చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..!

వాళ్లకు ఈనాడు మేనేజ్ మెంట్ సెటిల్ చేయలేదని.. అలాగే లేబర్ కమిషనర్ వద్ద కూడా ఈనాడు ప్రతినిధులు చర్చించలేదని సమాచారం. దీంతో ఈ 400మంది ఉద్యోగులు పోరుబాట పట్టినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పుడు రామోజీరావుకు ఇంతకంటే అవమానం లేదని.. సొంతూళ్లో నిరసన తెలిపితే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న చర్చ మీడియా వర్గాల్లో సాగుతోంది.