https://oktelugu.com/

విషాదపు ప్రేమ కథ.. ప్రతి పాత్ర వెనుక ఒక కథ !

‘మేక సూరి’… ఈ కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి సినిమా లేదు అని బాధ పడేవారికి జీ5 వారు అందించిన లేటెస్ట్ సినిమా ఇది. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా చూశాక, తెలుగు సినిమాను కూడా ఇంత సహజంగా తీస్తారా అనిపిస్తుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని సినిమాలో చూపించిన విధానం అద్భుతమైనది. ఇలాంటి సినిమాని ఏ స్టార్ డైరెక్టరో లేక […]

Written By:
  • admin
  • , Updated On : August 7, 2020 1:39 pm
    Follow us on

    Meka Suri

    ‘మేక సూరి’… ఈ కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి సినిమా లేదు అని బాధ పడేవారికి జీ5 వారు అందించిన లేటెస్ట్ సినిమా ఇది. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా చూశాక, తెలుగు సినిమాను కూడా ఇంత సహజంగా తీస్తారా అనిపిస్తుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని సినిమాలో చూపించిన విధానం అద్భుతమైనది. ఇలాంటి సినిమాని ఏ స్టార్ డైరెక్టరో లేక ఏ తల పండిన రచయితో తీసాడు అనుకుంటే.. త్రినాథ్‌ వెలిసెల అనే ముప్పై ఏళ్ల కుర్రాడు తీసాడట. అబ్బా.. అతని పనితనంకు ప్రత్యేక అభినందనలు చెప్పాలి.

    Also Read: రష్మిక మైండ్ కరాబు చేస్తున్న హీరో

    అతను రాసుకున్న స్క్రీన్ ప్లే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనవాళ్ళు అంతా తెలుగులో గొప్ప సినిమాలు రావు అంటారు గాని, నిజంగా ఇలాంటి గొప్ప సినిమా వచ్చినప్పుడు ఎందుకు చూడరు. మంచి సినిమా చూడాలనుకునే వారు జీ5 లో ఉన్న ఈ ‘మేక సూరి’ సినిమాని చూడండి. ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుంది. అసలు ఇలాంటి ప్రేమ కథలో అద్భుతమైన సస్పెన్స్ ను పెట్టడం అంటే మాటలా.. అరె కొత్త మొహాలతో ఇంత అవుట్ ఫుట్ ఈ త్రినాథ్‌ వెలిసెల అనే కుర్ర డైరెక్టర్ ఎలా రాబట్టిగలిగాడో.

    Also Read: స్పీడున్నోడు.. స్పీడు పెంచాడు..

    అనుభూతితో కూడా విషాదపు ప్రేమ కథను థ్రిల్ చేస్తూ చెప్పడం.. పైగా అనేక భావోద్వేగాల సమ్మేళనంలా సాగిన ఈ సినిమా తెలుగు న్యాచురల్ సినిమాల్లో మరో సినిమాగా నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాలో చివరిదాకా ఏం జరుగుతుందో.. హీరోయిన్ ను ఎవరు చంపారో అనే పాయింట్ ను అండ్ ట్విస్ట్ ను దర్శకుడు త్రినాథ్‌ వెలిసెల చాలా ఇంట్రస్ట్ గా చెప్పాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా పై దర్శకుడి పై గౌరవం కలుగుతుంది. అలాగే పార్థు సైనా ఛాయాగ్రహణంతో పాటు ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. వారి నుండి తన కథకు తగ్గ అవుట్ ఫుట్ ను దర్శకుడు చాలా బాగా రాబట్టుకున్నాడు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో బాగా ఆకట్టుకుంటున్న ఈ సినిమాని చూసి మంచి అనుభూతి పొందండి. ఫేమస్ డిస్ట్రిబ్యూట్ కార్తీక్ కంచెర్లకు చెందిన సింబా ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది.