https://oktelugu.com/

నివార్‌‌ బాధితులకు సర్కార్‌‌ సాయం

భారీ నివార్‌‌ తుఫాన్‌ ఏపీలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ తుఫానుతో జిల్లాలకు జిల్లాలు వణికిపోయాయి. ఎడతెరిపి లేకుండా పడిన వానలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిలలాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించింది. తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువగా కనిపించింది. ఈదురుగాలులు, వర్షాలు అతలాకుతలం చేశాయి. తిరుపతి సహా తూర్పు మండలాల్లో పెద్దఎత్తున నీరు చేరింది. తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో వరద […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 28, 2020 6:21 pm
    Follow us on

    భారీ నివార్‌‌ తుఫాన్‌ ఏపీలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ తుఫానుతో జిల్లాలకు జిల్లాలు వణికిపోయాయి. ఎడతెరిపి లేకుండా పడిన వానలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిలలాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించింది. తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువగా కనిపించింది. ఈదురుగాలులు, వర్షాలు అతలాకుతలం చేశాయి. తిరుపతి సహా తూర్పు మండలాల్లో పెద్దఎత్తున నీరు చేరింది. తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో వరద పారింది. తిరుపతి-మదనపల్లె, కుప్పం-పలమనేరు, పుంగనూరు-ముళబాగల్‌, పుంగనూరు-బెంగళూరు మార్గంలో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి.

    Also Read: అధికారుల మెడకే ఆ ‘చెత్త’ వ్యవహారం

    అయితే.. నివార్‌‌ తుఫాన్‌ బాధితులకు అప్పటి నుంచి ఎలాంటి సాయం అందకపోగా.. తాజాగా జగన్‌ సర్కార్‌‌ నిధులు రిలీజ్‌ చేసింది. దెబ్బతిన్న పంటలకు పెట్టుబడిగా రాయితీ చెల్లించేందుకు రూ.601 కోట్లు విడుదల చేసింది. నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నష్టపరిహారాన్ని జమ చేయనున్నారు. ఈ మొత్తాన్ని విపత్తు నిర్వహణ శాఖకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

    Also Read: >వైసీపీలో పెరుగుతున్న కుమ్ములాటలు

    కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బాధితులకు పరిహారం చెల్లించాల్లిస్తున్నారు. ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    నివార్‌‌ తుఫాన్‌ బాధితులను ఆదుకోవాలంటూ ఇన్నాళ్లు ప్రతిపక్షాలు, బాధితులు నోరెత్తాయి. ఇప్పుడు ఎట్టకేలకు పరిహారం రిలీజ్‌ చేయడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఆ పరిహారం కాస్త కొత్త పంటల సాగుకు ఉపయోగపడుతాయని అంటున్నారు.