‘బంగార్రాజు’కు చాన్నాళ్లకు మోక్షం.. షూట్ డేట్ ఫిక్స్ !

నాగ్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘బంగార్రాజు’. అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కీలకమైనది. ఈ మధ్య కాలంలో నాగార్జునకు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మరో సినిమాకి రాలేదు. పైగా నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించటం, ముఖ్యంగా నాగ్ లుక్ కూడా బంగార్రాజు గెటప్ లో బాగా సెట్ అవ్వడం కూడా ఈ సినిమా పై ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా సినీ వర్గాల […]

Written By: Neelambaram, Updated On : December 28, 2020 6:15 pm
Follow us on


నాగ్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘బంగార్రాజు’. అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కీలకమైనది. ఈ మధ్య కాలంలో నాగార్జునకు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మరో సినిమాకి రాలేదు. పైగా నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించటం, ముఖ్యంగా నాగ్ లుక్ కూడా బంగార్రాజు గెటప్ లో బాగా సెట్ అవ్వడం కూడా ఈ సినిమా పై ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం జనవరి 16వ తేదీ నుండి ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: త్రిపుల్ ధమాకా… పవన్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్!

నిజానికి ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పటికే రెండు సంవత్సరాల ఆలస్యం అయిపోయింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. అయితే తాజాగా సినిమా షూట్ డేట్ ఫిక్స్ అవ్వడంతో నాగ్ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే సింగిల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోన్నా అది ఎంతవరకూ సాధ్యం అవుతుందో చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలను సింగిక్ షెడ్యూల్ లో తీయడం కుదరని పని. మరి నాగ్ టీమ్ ఎలా ప్లాన్ చేసిందో.

Also Read: ‘ఆచార్య’ సెట్ లో రామ్ చరణ్.. చెకింగ్ కోసమే!

ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుందని.. ఆమె నాగార్జున భార్య పాత్రలోనే కనిపించబోతుందని టాక్. కాగా ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నాడని.. రీసెంట్ గా ఇద్దరు కలిసి గోవా ట్రిప్ కూడా వేశారట. ఇప్పటికే ట్యూన్స్ కూడా పూర్తయ్యాయట. మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా ఉంది. ఎలాగూ ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది, అలాగే ఈ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్