
పవన్ కళ్యాణ్ గతంలో ఏడాదికి ఒక సినిమా చేసేవారు. ఒకే ఏడాది పవన్ నుండి రెండు సినిమాలు రావడం చాలా అరుదు. అలాంటి పవన్ వరుస సినిమాలు ప్రకటించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. అజ్ఞాతవాసి మూవీ తర్వాత ఫుల్ టైమ్ పొలిటీయషన్ గా మారిన పవన్ కళ్యాణ్… ఇక సినిమాలు చేయడం కష్టమే అనుకున్నారు అందరూ. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ… పవన్ వకీల్ సాబ్ తో తన కమ్ బ్యాక్ గ్రాండ్ గా ప్రకటించాడు.
Also Read: సంక్రాంతికి టీజర్లతో రానున్న పవన్, ప్రభాస్ !
పవన్ డైహార్డ్ ఫ్యాన్స్ పవన్ ప్రకటనతో పండగ చేసుకున్నారు. వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ పవన్ వరుస చిత్రాలు ప్రకటించారు. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలతో పాటు… అయ్యప్పనుమ్ కోశియుము రీమేక్ పవన్ చేస్తున్నారు. కాగా ఏడాది వ్యవధిలో పవన్ నుండి మూడు సినిమాలు రానున్నాయట. పింక్ రిమేక్ వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక అయ్యప్పనుమ్ కోశియుమ్ షూటింగ్ జనవరి నుండి మొదలుకానుంది. నెలల వ్యవధిలో పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేస్తారట.
Also Read: కోటప్ప కొండలో బాలయ్య షూటింగ్ !
వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియడిక్ మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొననున్నారు. ఏక కాలంలో అయ్యప్పనుమ్ కోశియుమ్ రిమేక్ షూటింగ్ తో పాటు, క్రిష్ పీరియాడిక్ మూవీ షూటింగ్ పూర్తి చేయనున్నారట. క్రిష్ మూవీ షూటింగ్ 2021లో పూర్తి చేసి 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారట. మొత్తంగా ఏడాది కాలంలో పవన్ మూడు సినిమాలు విడుదల చేయనున్నాడట. పవన్ నుండి ఏడాదిలో మూడు సినిమాలు అంటే మాములుగా విషయం కాదు. అసలు సినిమాలే చేయడనుకున్న పవన్ నుండి మూడు సినిమాలు అంటే మాటలు కాదు. పవన్ ఫ్యాన్స్ కి ఇది పూనకాలు తెప్పించే న్యూస్ అని చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Comments are closed.