AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త సంవత్సర కానుక అందించనుంది. డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా సిద్ధం చేసింది. 2019 జులై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏను విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 2022 జనవరి నుంచి పెంచిన డీఏను ఉద్యోగుల జీతాలతో జమ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంతో కాస్త సంబరపడుతున్నా ఇంకా పీఆర్సీ విడుదల చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అయితే డీఏను మూడు విడతల్లో చెల్లించేందుకు నిర్ణయించింది. పది శాతం ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం జీతాలకు చెల్లించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీంతో జెడ్పీ, మండల, గ్రామ పంచాయతీలు, ఎయిడెడ్, విశ్వవిద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బందికి కూడా డీఏ చెల్లించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే పీఆర్సీ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ తో సమావేశం నిర్వహించింది.
ఉద్యోగ సంఘాల చేస్తున్న డిమాండ్లపై చర్చించారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. సెంట్రల్ పీఆర్సీ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల జీతాలు తగ్గుతున్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. దీని కోసమే మధ్యంతర భృతి 27 శాతం కంటే తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ నెలాఖరు వరకు పీఆర్సీపై ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
Also Read: Raghuveera Reddy: పార్టీ మారేందుకు రఘువీరా సిద్ధమేనా?.. రంగం సిద్ధం చేసుకున్న నేత
కరోనా పరిస్థితులు, రాష్ర్ట ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే పీఆర్సీ ప్రకటన ఉంటుందని సమాచారం. ఉద్యోగులు పరిస్థితులను అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా కోరుతున్నారు. ఎక్కువ ఊహించుకుని తక్కువైందని రాద్దాంతం చేయడం తగదని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే దాన్ని స్వీకరించి ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Also Read: Power: పవన్ కల్యాణ్ ‘పవర్’ చూపించాల్సిన టైం వచ్చిందా?