https://oktelugu.com/

Shyam Singha Roy: ‘శ్యామ్​ సింగరాయ్’​లో కిస్ సీన్​పై యాంకర్​ డౌట్​.. స్ట్రాంగ్​ కౌంటర్ ఇచ్చిన సాయిపల్లవి

Shyam Singha Roy: నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్ ​సింగరాయ్​. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిహారిక ఎంటర్​టైన్మెంట్​ పతాకంపై వెంకట్​ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికేే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్​లు, వీడియోలు విడుదలై సినిమాపై భారీ అంచనాలు క్రియేట్​ చేశాయి. డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కానుండటంతో.. ప్రమోషన్స్​లో ఫుల్ బిజీగా మారింది చిత్రయూనిట్​. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 04:25 PM IST
    Follow us on

    Shyam Singha Roy: నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్ ​సింగరాయ్​. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిహారిక ఎంటర్​టైన్మెంట్​ పతాకంపై వెంకట్​ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికేే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్​లు, వీడియోలు విడుదలై సినిమాపై భారీ అంచనాలు క్రియేట్​ చేశాయి. డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కానుండటంతో.. ప్రమోషన్స్​లో ఫుల్ బిజీగా మారింది చిత్రయూనిట్​.

    Shyam Singha Roy

    ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో టీమ్​ మొత్తం పాల్గొన్నారు. కాగా, సినిమాలో నాని, కృతిశెట్టి మధ్య కిస్​ సీన్​ గురించి యాంకర్ ప్రస్థావిస్తూ..  ఆ సీన్ చేసేటప్పుడు ఎవరు ఎక్కువగా కంఫర్ట్ ఫీల్ అయ్యారు?.. అని అడిగింది.. వెంటనే పక్కనే ఉన్న సాయి పల్లవి కలుగజేసుకుని.. ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడే అసౌకర్యంగా ఫీల్ అవుతామ్​.. అని కౌంటర్ ఇచ్చింది. ఆ సీన్​ డిస్కర్​ చేసి, ఒకరినొకరు అర్థం చేసుకుని.. కథ కోసం అలా చేశారు. మీరు దాన్ని ఇలా అడిగినప్పుడే చాలా అన్​కంఫర్ట్​గా ఉంటుంది.. అని సాయిపల్లవి సమాధానమిచ్చింది.

    Also Read: అదే జరిగితే ‘నాని’ స్థాయి సగం పడిపోయినట్టే !

    ఆ తర్వాత నాని మాట్లాడుతూ.. కథ కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే.. ఏదీ అసౌకర్యంగా అనిపించదు. ఓ నటులుగా కథతో కనెక్ట్ అయ్యాకే సినిమాకు ఒప్పుకుంటాం. అని చెప్పుకొచ్చారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    Also Read: ఆ పాత్ర కోసం 15 గెటప్ లు ట్రై చేశా: నాని