https://oktelugu.com/

ఏపీ ఖజానాపై పయ్యావుల బాంబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. లెక్కలేనన్ని అప్పులు చేస్తూ కష్టాల్లో పడుతోంది. వేల కోట్లు అప్పులుగా తెస్తూ ఇబ్బందులు కొనితెచ్చుకుంటోంది. ఏపీ ప్రభుత్వం పాతిక వేల కోట్ల అప్పుకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే తీసుకొచ్చిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పలు పత్రాలను టీడీపీ నేత పయ్యావుల కేశవ్ బయటపెట్టారు. ప్రభుత్వం ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో పాతిక వేల కోట్ల రుణం బ్యాంకుల నుంచి తీసుకుందని చెబుతున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ […]

Written By: , Updated On : July 22, 2021 / 07:28 PM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. లెక్కలేనన్ని అప్పులు చేస్తూ కష్టాల్లో పడుతోంది. వేల కోట్లు అప్పులుగా తెస్తూ ఇబ్బందులు కొనితెచ్చుకుంటోంది. ఏపీ ప్రభుత్వం పాతిక వేల కోట్ల అప్పుకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే తీసుకొచ్చిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పలు పత్రాలను టీడీపీ నేత పయ్యావుల కేశవ్ బయటపెట్టారు. ప్రభుత్వం ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో పాతిక వేల కోట్ల రుణం బ్యాంకుల నుంచి తీసుకుందని చెబుతున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వం తరఫున అప్పుల కోసం ఎలాంటి హామీ ఇవ్వలేదని వాదిస్తున్నారు.

ప్రభుత్వం బ్యాంకులతో రహస్య ఒప్పందం చేసుకుందని పయ్యావుల కేశవ్ ఆరోపిస్తున్నారు. సర్కారు పాతిక వేల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. పాతికేళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఎస్కోృ ఖాతాకు మళ్లించేందుకు కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం చేపట్టే పనులకు ఎగాదిగ రుణాలు చేసేందుకు పలు హామీలు ఇస్తూ వేల కోట్ల నిధులు దారి మళ్లించిందని దుయ్యబట్టారు.

పయ్యావుల కేశవ్ బయటపెట్టిన విషయాలు సంచలనంగా మారనున్నాయి. ప్రభుత్వం రుణాలు తీసుకుని దాచి పెట్టేందుకు తాపత్రయపడుతోందని దుయ్యబట్టారు. చట్టాలను ఉల్లంఘించి నిధులు రాబట్టుకోవడం ప్రభుత్వానికి అలవాటే అని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్లు తెచ్చుకుంటుందని పేర్కొన్నారు. ప్రజల పన్నులను నేరుగా కాన్సాలిడేటెడ్ ఫండ్ కు కాకుండా ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నారని ఆరోపించారు. బ్యాంకులను బురిడీ కొట్టించి అడ్డగోలుగా నిధులు రాబట్టుకుంటుందని వివరించారు.

ప్రభుత్వ తీరుపై పయ్యావుల కేశవ్ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. అడ్డదారుల్లో ప్రభుత్వం రాబట్టే నిధులపై నిజాలు బయటపెడతానని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణ కోసం పలు మార్గాల ద్వారా ప్రజా ధనాన్ని గుట్టుగా ఉంచుకునే క్రమంలో పలు మార్గాల్లో విషయాలు దాస్తున్నారని మండిపడ్డారు. నిజాలు ఎప్పటికైనా బయటకొస్తాయని చెప్పారు. ఇంకా రెండున్నరేళ్ల కాలం గడవాలంటే ఇంకా ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.