https://oktelugu.com/

‘మహేష్ – రాజమౌళి’ కోసమే ఆయన వెతుకులాట !

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ సినిమా తీయాలని ప్లాన్ చేసినట్లు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. పైగా జక్కన్న కూడా అధికారికంగా ఎప్పుడో చెప్పాడు కూడా. కేఎల్ నారాయణ ఈ సినిమాకి నిర్మాత. ఎప్పటి నుంచో లైన్ లో ఉన్న ఈ సినిమాకి ఇంకా కథ సెట్ అవ్వలేదు. సహజంగా విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి సినిమాలకి కథలు అందిస్తాడు. అలాగే ఈ సినిమా కోసం పది లైన్లు చెప్పాడు. కానీ ఏది […]

Written By:
  • admin
  • , Updated On : July 22, 2021 / 07:20 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ సినిమా తీయాలని ప్లాన్ చేసినట్లు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. పైగా జక్కన్న కూడా అధికారికంగా ఎప్పుడో చెప్పాడు కూడా. కేఎల్ నారాయణ ఈ సినిమాకి నిర్మాత. ఎప్పటి నుంచో లైన్ లో ఉన్న ఈ సినిమాకి ఇంకా కథ సెట్ అవ్వలేదు. సహజంగా విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి సినిమాలకి కథలు అందిస్తాడు.

    అలాగే ఈ సినిమా కోసం పది లైన్లు చెప్పాడు. కానీ ఏది రాజమౌళికి నచ్చలేదు. కారణం రాజమౌళి ఎప్పటి నుండో మహేష్ కోసం ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు. అదే జేమ్స్ బాండ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ తోనే విజయేంద్ర ప్రసాద్ మొత్తం స్క్రిప్ట్ రాశారు. కానీ అది ఎవరికీ నచ్చకపోవడంతో సీక్రెట్ ఏజెంట్ పాత్ర తీసుకుని మరో కథ రాశారు.

    ప్రస్తుతం ఈ కథ పైనే ఉంది టీమ్. కానీ, రాజమౌళి మాత్రం ఈ కథను ఇంకా ఫైనల్ చేయలేదు. అందుకే, నిర్మాత కేఎల్ నారాయణ కూడా కథలు వింటున్నాడు. తెలుగు రైటర్స్ దగ్గరే కాకుండా పక్క భాషల్లోని రైటర్స్ దగ్గర కూడా కథలు వింటున్నారు. వాటిల్లో బాగున్న కథలను రాజమౌళి దగ్గరకు పంపిస్తాడట.

    మరి, వాటిల్లో ఏ కథైనా రాజమౌళికి నచ్చితే.. మహేష్ తో సినిమా ఫిక్స్ అయినట్టే. కాకపోతే.. రాజమౌళికి కథ నచ్చడం అంత ఈజీ కాదు కాబట్టి, ఇప్పట్లో మహేష్ – రాజమౌళి సినిమా మొదలవుతుంది అని ఊహించలేం. అయితే గతంలో ఈ సినిమా కథ విషయంలో ఓ వార్త బాగా వినిపించింది. అదేమిటంటే ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతోందని.

    నిజంగా మహేష్ బాబు ఛత్రపతి శివాజీగా నటిస్తే చాల బాగుంటుంది. పైగా ఛత్రపతి శివాజీ అంటే.. నేషనల్ వైడ్ గా కూడా భారీ అంచనాలు ఉంటాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.