AP Government: ఏపీ సర్కారు గత కొద్ది రోజుల నుంచి సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తున్నట్లు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా స్పష్టమవుతోంది. టికెట్ల ధరల తగ్గింపుపై సినీ ప్రముఖులు, ఏపీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ విషయమై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని కలిసి తన వాదనను వినిపించనున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. సంక్రాంతి పండుగ వేళ.. ఏపీలోని థియేటర్లపై రెవెన్యూ శాఖ అధికారుల దాడులు మళ్లీ మొదలయ్యాయి.

భద్రతా ప్రమాణాలు పాటించాలని ఇటీవల అధికారులు పలు థియేటర్స్ ఓనర్స్‌కు సూచించారట. అయినప్పటికీ వారు భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవడం లేదనే కారణాలరిత్యా థియేటర్లపై దాడులను మళ్లీ స్టార్ట్ చేసింది. అలా సంక్రాంతి పండుగ పూటపై ఏపీ సర్కారు మళ్లీ థియేటర్లపైన కొరడా ఝుళిపిస్తోంది.
Also Read: విశాఖపై బీజేపీ ఫోకస్.. తెరవెనుక రాజకీయం ఏంటి?
థియేటర్లను తనిఖీ చేయడంతో పాటు దాడులను మరింత ముమ్మరం చేయనున్నారు అధికారులు. ఇకపోతే తాజాగా చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో, శ్రీకాకుళంలో మూడు థియేటర్స్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఏడాది కాలంగా టాకీసుల యజమానులు తమ లైసెన్సును రెన్యువల్ చేసుకోవడం లేదని తమ తనిఖీలో తేలిందని, ఈ సందర్భంగా థియేటర్స్‌ను సీజ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. థియేటర్స్ ఓనర్స్ తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు. అయినా వాటిని టాకీసుల ఓనర్లు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
లైసెన్స్ రెన్యువల్ కు గడువు ఇచ్చినప్పటికీ థియేటర్ల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అధికారులు అంటున్నారు. కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని చెప్తున్నారు. జనరల్‌గా సంక్రాంతి సీజన్ సందర్భంగా జనాలు హ్యాపీగా థియేటర్స్‌కు వచ్చి సినిమాలు చూస్తుంటారు. పెద్ద సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ఉంటుంటాయి. కానీ, ఈ సారి అటువంటి పరిస్థితులు లేవు. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితుల వలన పెద్ద సినిమాల విడుదల పోస్ట్ పోన్ అయ్యాయి. ఇకపోతే థియేటర్ల యజమానులపై భద్రతా ప్రమాణాలు, లైసెన్సు విషయమై ఏపీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
[…] […]
[…] […]
[…] […]