ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అక్కడి ప్రభుత్వం ఎవరిమాట వినాలనుకోవడం లేదు. హై కోర్టుపై నమ్మకం ఉందని చెప్పి.. ఏం తీర్పు ఇచ్చినా.. శిరసా వహిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పడు ఆ తీర్పును కూడా లెక్క చేయడం లేదు. సుప్రీం కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే.. న్యాయవ్యవస్థను పొగిడి.. నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకవేళ సుప్రీం కోర్టు నుంచి కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అప్పడైనా ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందా.. అన్నదే ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: మాట వినని నిమ్మగడ్డ.. రంగంలోకి పోలీసులు?
కోవిడ్ ప్రారంభమైన తరువాత కనీసం అరడజను రాష్ట్రాలలో స్థానిక ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి. అన్నింటిలోనూ సుప్రీంకోర్టు ఒకే విషయమైన తీర్పును వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందేనని తేల్చింది. ఇప్పడు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు వద్దని ఫిటిషన్ వేసింది. న్యాయ నిపుణులు.. లా వ్యవహారాలపై కనీస అవగాహన ఉన్నవారు కూడా ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చేసిన తరువాత కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవని గుర్తు చేస్తున్నాయి.
సీఈసీకి ఉన్న అధికారాలు.. ఎస్ఈసీకి కూడా ఉంటాయని పలుమార్లు కోర్టులు తీర్పులు కూడా చెప్పిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఈ ప్రకారంగా.. సుప్రీం కోర్టులో ఏపీ సర్కారుకు ఊరట లభించే అవకాశం తక్కువే. ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సోమవారం ఉదయం పది గంటలకు అన్ని జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేసి నామినేషనుల స్వీకరించడం ప్రారంభించాలి.
Also Read: నిమ్మగడ్డ యాక్షన్ వెనుకున్నది ఆయనేనా?
సుప్రీంలో ఏపీ సర్కారు ఫిటిషన్ కొద్ది సేపట్లో విచారణకు రానుంది. అంటే నోటిఫికేషన్ జారీ చేయకుంటే.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టే. సుప్రీం కోర్టు ఈఎన్సీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉంటుందా..? అన్నది ప్రశ్న. ఎందుకంటే ఎన్నికలు నిర్వహించకూడదన్నది జగన్ పట్టుదల. సీఎం నేనా.. రమేశ్ కుమార్ అని జగన్ మొండిగా వ్యవహరిస్తున్నాడు. తాను చెప్పిన విధంగానే జరగాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ సుప్రీం కోర్టు చెప్పినా.. ఎన్నికల నిర్వహణకు సహకరించకపోతే.. స్వతంత్ర భారత చరిత్రలో జగన్ సరికొత్త అధ్యాయం లికించినట్లే.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్