Champion Movie Box Office Collections : ‘పెళ్లి సందడి’ చిత్రంతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ కొడుకు రోషన్(Roshan Meka), నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తీసుకొని ఈ క్రిస్మస్ కి ‘ఛాంపియన్'(Champion Movie) చిత్రం ద్వారా మన ముందుకొచ్చాడు. విడుదలకు ముందు ట్రైలర్ తో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన ఈ చిత్రం, విడుదల తర్వాత మాత్రం కాస్త డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎంచుకున్న థీమ్, కాన్సెప్ట్ అన్ని మంచివే కానీ, డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని ఎక్కువగా ల్యాగ్ చేయడం వల్ల, ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ బోరింగ్ ఫీల్ రావడం తో ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా చాలా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తోంది. మంచి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, వీకెండ్ వరకు కూడా అదే తరహా వసూళ్లు కొనసాగుతూ వచ్చాయి.
ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 10.15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం తో మరో మూడు సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఆ మూడు సినిమాలకంటే ఈ చిత్రానికే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఆ మూడు సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దగ్గరలో ఉన్నాయి, ఛాంపియన్ మాత్రం చాలా దూరం లో ఉంది. ట్రేడ్ విశ్లేషకుల లెక్క ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 5.20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాల్సిన అవసరం ఉంది. అంటే మరో 12 కోట్ల రూపాయిల గ్రాస్ రావాలి అన్నమాట.
నేడు బుక్ మై షో లో ఈ చిత్రానికి 6 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు 30 లక్షలకు పైగా, షేర్ వసూళ్లు 15 లక్షలకు పైగా ఉండొచ్చు. ఈ ట్రెండ్ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఏ మాత్రం ఉపయోగపడదు. ఈ న్యూ ఇయర్ వీకెండ్ మాత్రమే ఈ సినిమాని కొంతవరకు కాపాడగలదు. కానీ పవన్ కళ్యాణ్ జల్సా, మహేష్ బాబు మురారి చిత్రాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఆ ప్రభావం ‘ఛాంపియన్’ పై పడే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మరో నాలుగు కోట్ల గ్రాస్ వసూళ్లు , రెండు కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చేలా అనిపిస్తుంది. అదే కనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ గా మిగులుతుంది. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.