https://oktelugu.com/

ఫోన్ ట్యాపింగ్: చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన జగన్

ఫోన్ ట్యాపింగ్.. టీడీపీ, దాని అనుకూల మీడియా లేవనెత్తిన ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు అధికార జగన్ ప్రభుత్వం మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. చంద్రబాబు మారు మాట్లాడకుండా గట్టి జవాబును ఏపీ డీజీపీ ద్వారా అందించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా డీజీపీ లేఖ రాయడం సంచలనమైంది. ఇందులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడం అనూహ్య మలుపుగా రాజకీయవర్గాలు అభివర్ణిస్తున్నాయి. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : August 18, 2020 / 11:45 AM IST
    Follow us on


    ఫోన్ ట్యాపింగ్.. టీడీపీ, దాని అనుకూల మీడియా లేవనెత్తిన ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు అధికార జగన్ ప్రభుత్వం మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. చంద్రబాబు మారు మాట్లాడకుండా గట్టి జవాబును ఏపీ డీజీపీ ద్వారా అందించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా డీజీపీ లేఖ రాయడం సంచలనమైంది. ఇందులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడం అనూహ్య మలుపుగా రాజకీయవర్గాలు అభివర్ణిస్తున్నాయి.

    Also Read: రూ.5 కోట్లు లంచం తీసుకున్న తహసీల్దార్?

    అసలు వివాదం ఏంటంటే.. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ప్రధాని నరేంద్రమోడీకి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొన్న చంద్రబాబు.. రాజ్యాంగంలోని 19,21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురి అవుతున్నట్లు చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

    కాగా చంద్రబాబు లేఖపై ఏకంగా ఏపీ రాష్ట్ర డీజీపీ స్పందించి కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు ఆయన ప్రతి లేఖ రాశారు. వైసీపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనడానికి సాక్ష్యాధారాలు ఉంటే తమకు అందజేయాలని కోరారు. టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు రాసిన నేపథ్యంలో డీజీపీ ఈ సవాల్ చేయడం సంచలనమైంది. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి తాము కఠిన చర్యలు తీసుకుంటామని.. సమగ్ర దర్యాప్తు చేస్తామని.. దర్యాప్తుకు సహకరించాలని డీజీపీ తాజాగా చంద్రబాబుకు లేఖ లో కౌంటర్ అటాక్ చేశారు.

    కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని గౌతమ్ సవాంగ్ గుర్తు చేశారు. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తులు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1985, ఐటీ యాక్ట్ 2000 ప్రకారం సున్నితమైన అంశమని.. తాము దర్యాప్తు చేయడానికి సిద్ధమని డీజీపీ స్పష్టం చేశారు.

    Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

    ఇక చివరగా ఫోన్ ట్యాపింగ్ పై ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు.. తమకు సాక్ష్యాధారాలు అందజేయాలని.. తాము దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు.

    ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఏకంగా అధికార పార్టీ కానీ… సీఎం జగన్ కానీ స్పందించకుండా ప్రభుత్వ అత్యున్నత అధికారి డీజీపీ రంగంలోకి దిగి చంద్రబాబును.. ఆయన మీడియాను ఇరుకునపెట్టడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. త్వరలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ గుట్టును ఏపీ పోలీసులు ఛేదిస్తారని అంటున్నారు. ఇది టీడీపీ వేసిన ప్లాన్ అయితే చంద్రబాబు ఇరుకునపడడం ఖాయమంటున్నారు. ఈ వివాదంపై ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత, మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు.. ‘చంద్రబాబుకు ఇది మాస్టర్ స్ట్రోక్ ’ గా అభివర్ణించారు.