https://oktelugu.com/

టాలెంటెడ్ డైరెక్టర్ కి తీవ్ర అవమానం !

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే విలువ. టైం కలిసి రాక ఒక సినిమా పరాజయం పాలైతే.. ఇక ఆ సినిమా డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ అయినా సరే.. అంత తొందరగా ఆ డైరెక్టర్ కి అవకాశాలు రావు అని శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ను చూస్తే అర్ధం అవుతోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా అసురన్ సినిమాని తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నా.. శ్రీకాంత్ అడ్డాలకు ఈ సినిమా అంత తేలిగ్గా ఏం రాలేదు. బ్రహ్మోత్సవం ప్లాప్ […]

Written By:
  • admin
  • , Updated On : August 18, 2020 / 11:58 AM IST
    Follow us on


    సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే విలువ. టైం కలిసి రాక ఒక సినిమా పరాజయం పాలైతే.. ఇక ఆ సినిమా డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ అయినా సరే.. అంత తొందరగా ఆ డైరెక్టర్ కి అవకాశాలు రావు అని శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ను చూస్తే అర్ధం అవుతోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా అసురన్ సినిమాని తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నా.. శ్రీకాంత్ అడ్డాలకు ఈ సినిమా అంత తేలిగ్గా ఏం రాలేదు. బ్రహ్మోత్సవం ప్లాప్ తరువాత శ్రీకాంత్ కి ఈ సినిమా మొదలుపెట్టడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. అదీ వెంకటేష్ సహాయంతో. వెంకీ పూనుకోకపోతే శ్రీకాంత్ ఇంకా ఖాళీగా ఉండేవాడేమో.

    Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

    ఇండస్ట్రీ మొత్తం నమ్మకం మీదే నడుస్తోంది అంటారు గానీ, అసలు ఇండస్ట్రీలో లేనిదే నమ్మకం.. లేకపోతే ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చక్కటి కుటుంబ కథా చిత్రాలను తీసిన డైరెక్టర్ ను సెకెండ్ లెవల్ స్టార్ హీరోలు కూడా నమ్మకపోవడం.. పైగా ఏడాది నుండి తిప్పించడం ఎంత అవమానం. ఈ టాలెంటెడ్ దర్శకుడికి మంచి చిత్రాలు తీస్తాడనే మంచి పేరు ఉన్నా.. ఎందుకో ఫామ్ లో ఉన్న ఓ హీరో మాత్రం శ్రీకాంత్ కథను ఏడాది నుండి తిరస్కరిస్తూనే ఉన్నాడు. అలా అని సినిమా చెయ్యను అనడం లేదు. కథలో ఈ మార్పు చేయండి, ఆ మార్పు చేయండి అంటూ అనవసరమైన సలహాలు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.

    Also Read: గాన గంధర్వుడి ఆరోగ్యం అత్యంత విషమం !

    ఇప్పటికే కథ మీద మూడేళ్లు పని చేసాడు శ్రీకాంత్ అడ్డాల. దానికి తోడు లాక్ డౌన్ తో కలిసి వచ్చిన నాలుగు నెలల ఖాళీ సమయాన్ని కూడా ఈ కథ కోసమే వెచ్చించాడు. ఆ న్యాచురల్ స్టార్ మాత్రం కథ బాగుంది, మనం సినిమా చేయబోతున్నాం అని మాత్రం చెప్పడం లేదు. ఎప్పుడూ వెళ్లి కథ చెప్పినా.. కథలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకున్నాక ముందుకు వెళ్దాం అంటున్నాడట. నిజానికి అవి డౌట్స్ కాదు, నారప్ప హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అని అనుమానం. అందుకే ఆ హీరో ఏదొకటి చెప్పి.. సినిమాని మాత్రం కన్ఫర్మ్ చేయట్లేదు. ఇప్పటికైనా శ్రీకాంత్ అడ్డాల లాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ హీరోల చుట్టూ తిరగడం మానేయాలి. కొత్త వాళ్ళతోనైనా సినిమాలు చేసుకుంటూ పోవాలి. అప్పుడే ఈ హీరోలు దిగి వస్తారు.