https://oktelugu.com/

బీజేపీ పాలన మరీ.. ప్రశ్నిస్తే కేసులు, జైలుకే.?

మొన్న కత్తి మహేష్.. నేడు నటి మాధవీలత.. బీజేపీని.. హిందుత్వంను ప్రశ్నిస్తే కేసులు.. జైలుకే.. గత కాంగ్రెస్ పాలనకు.. ఇప్పటి బీజేపీ పాలనకు తేడా ఏంటంటే వాక్ స్వాతంత్ర్యం. అప్పుడు ఏం మాట్లాడినా లౌకిక వాదం అంటూ వదిలేశారు. కానీ ఇప్పుడు మాట్లాడితే జైలుకు పంపుతున్నారు. బీజేపీ గెలిచిందే హిందుత్వ ఎజెండా మీద.. వారిది జాతీయవాదం.. హిందుత్వం పునాదులు అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 18, 2020 / 11:32 AM IST
    Follow us on


    మొన్న కత్తి మహేష్.. నేడు నటి మాధవీలత.. బీజేపీని.. హిందుత్వంను ప్రశ్నిస్తే కేసులు.. జైలుకే.. గత కాంగ్రెస్ పాలనకు.. ఇప్పటి బీజేపీ పాలనకు తేడా ఏంటంటే వాక్ స్వాతంత్ర్యం. అప్పుడు ఏం మాట్లాడినా లౌకిక వాదం అంటూ వదిలేశారు. కానీ ఇప్పుడు మాట్లాడితే జైలుకు పంపుతున్నారు.

    బీజేపీ గెలిచిందే హిందుత్వ ఎజెండా మీద.. వారిది జాతీయవాదం.. హిందుత్వం పునాదులు అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

    ఇటీవల హిందువులపై కామెంట్ చేసి.. దేవుళ్లపై తన అభిప్రాయాన్ని చెప్పిన వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ పై కేసు నమోదు కాగా.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

    ఇక తాజాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నటి మాధవీలత .. తన ఫేస్ బుక్ లో హిందువులపై కామెంట్ చేసిందని సమాచారం. అయితే ఈ కామెంట్స్ తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని హైదరాబాద్ వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సోమవారం నటి మాధవీలతపై 295-ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.

    Also Read: కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

    ఇంతకుముందు కూడా హిందుత్వంపై చాలా మంది కామెంట్ చేసినా కేసుల వరకు పరిస్థితి వెళ్లలేదు. కానీ ఇప్పుడు కేసులు నమోదవుతుండడం చర్చనీయాంశమైంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందుత్వ, జాతీయవాదం దేశంలో పెరిగిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదని మేధావులు చెబుతున్నారు. ఒకప్పుడు వాక్ స్వాతంత్య్రానికి ఎక్కువగా విలువనిచ్చే ఈ దేశంలో ఇప్పుడు ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు, అరెస్ట్ ల దాకా వ్యవహారం వెళుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.