https://oktelugu.com/

Jagan Bail: జగన్, విజయసాయి బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు సంచలన తీర్పు

ap cm ys jagan mohan reddy mp vijayasaireddy relief in cbi court raghurama krishnaraja`s petition rejected: అటు ఏపీ ప్రజలు, నాయకులు, ఇటు వైసీపీ నేతలంతా కంగారు పడుతున్న ‘జగన్ బెయిల్ రద్దు’ పిటీషన్ పై ఎట్టకేలకు సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి గొప్ప ఊరట కలిగించింది. ఇదే సమయంలో వీళ్ల బెయిల్ రద్దు చేయాలని కంకణం కట్టుకున్న వైసీపీ రెబల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2021 / 03:31 PM IST
    Follow us on

    ap cm ys jagan mohan reddy mp vijayasaireddy relief in cbi court raghurama krishnaraja`s petition rejected: అటు ఏపీ ప్రజలు, నాయకులు, ఇటు వైసీపీ నేతలంతా కంగారు పడుతున్న ‘జగన్ బెయిల్ రద్దు’ పిటీషన్ పై ఎట్టకేలకు సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి గొప్ప ఊరట కలిగించింది. ఇదే సమయంలో వీళ్ల బెయిల్ రద్దు చేయాలని కంకణం కట్టుకున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు గట్టి షాక్ తగిలింది.

    అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకు కూడా సీబీఐ కోర్టు నో చెప్పింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ కోర్టు తాజాగా సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు వైసీపీ బ్యాచ్ కు గొప్ప ఊరటనిచ్చినట్టైంది.

    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. అప్పట్లోనే జగన్ సీఎంగా ఉంటూ ప్రత్యక్షంగా.. పరోక్షంగా సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో వారి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై సీబీఐ కోర్టు గత రెండు మూడు నెలలుగా సుధీర్ఘ విచారణ జరిపింది.

    జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలు తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటీషన్ దాఖలు చేశారని జగన్ తరుఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.

    ఇరువైపులా వాదనలు విన్న సీబీఐ కోర్టు తాజాగా రఘురామకృష్ణంరాజు పిటీషన్ ను కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరటనిచ్చింది.

    అయితే ఎంపీ రఘురామ మాత్రం సీబీఐ కోర్టు తీర్పుపై తాను హైకోర్టుకు వెళ్లనున్నట్లు మరోసారి ట్విస్ట్ ఇచ్చాడు.