spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Sarkaru Vaari Paata: కీర్తితో మహేష్ పెళ్లి చూపులు !

Mahesh Babu Sarkaru Vaari Paata: కీర్తితో మహేష్ పెళ్లి చూపులు !

Mahesh Babu Sarkaru Vaari PaataMahesh Babu Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ రోజు కీర్తి సురేష్ – మహేష్ లతో పాటు మిగిలిన ప్రధాన పాత్రల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ లోనే మహేష్ – కీర్తి సురేష్ ల పెళ్లి చూపులు సీన్ కూడా ఉందట.

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది. ముందుగా చెప్పిన ప్రకారమే ‘సంక్రాంతి’ కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెన్స్ బుల్ సినిమాల దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ క్రేజీ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల ప్రస్తావన ప్రధానంగా ఉండబోతుంది. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి తిరిగి ఆ డబ్బును ఎలా రాబట్టాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. ఇక ఆ మధ్య దుబాయ్ షెడ్యూల్ లో ఈ బ్యాంక్ సీన్స్ నే షూట్ చేశారు.

కాగా ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయట. అలాగే రీసెంట్ గా జరిగిన ‘గోవా’ షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటు విలన్స్ పై కూడా భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు. ఇప్పుడు చేస్తోన్న పెళ్లి చూపులు సీన్ కూడా సినిమాలో బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోందట.

తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. మైత్రీ – 14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version