CM Jagan: ఏపీ సీఎం కలవరపాటుకు గురువుతున్నారా? కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారా? సర్వేలు ఆందోళనలకు గురిచేస్తున్నాయా? వచ్చే ఎన్నికల్లో అధికారం దూరం కానుందని హెచ్చరికలు వచ్చాయా? అందుకే ఎమ్మెల్యేలకు రెండో సారి వర్క్ షాపు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారా? అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా.. అభివృద్ధి లేకపోవడంతో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. చాలావర్గాల్లో అసంతృప్తి నెలకొంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు కూడా ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ తన ప్రశాంత్ కుమార్ ఐ ప్యాక్ టీమ్ సభ్యులతో సర్వే జరిపించారు. ప్రభుత్వంతో పాటు జగన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తమైనా.. ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదని తేటతెల్లమైంది. అసలు ఎమ్మెల్యేల గ్రాఫ్ అమాంతం పడిపోయిందని సర్వేలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన జగన్ ఎమ్మెల్యేలకు రెండు నెలల కిందట ఒక వర్క్ షాప్ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పనితీరు మార్చుకోవాలని, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని ఆదేశించారు. ఇందుకు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దీంతో అధిష్టానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల బాట పట్టారు. కానీ ప్రజల నుంచి అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయి. మా ఇంటికి, వీధులకు రావొద్దని ప్రజాప్రతినిధుల ముఖం మీదే ప్రజలు చెప్పేశారు. ఎలాగోలా కార్యక్రమం ముగించామనుకున్న తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలపై అధినేత మరో బాంబు పేల్చారు. మరోసారి వర్కుషాపు నిర్వహించడానికి నిర్ణయించారు.

మరింత దిగజారిన పనితీరు..
ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్త కొలువు నుంచి రాజకీయ నాయకుడిగా మారారు. తన సొంత రాష్ట్రమైన బిహార్ వెళ్లారు. అడపాదడపా కేసీఆర్ కు రాజకీయ సలహాలు అందిస్తున్నారు. అయితే ఏపీలో తన బృందంలో ఒక సభ్యుడైను రుషిరాజ్ సింగ్ కు ఏపీ బాధ్యతలు అప్పగించాడు. దీంతో రుషిరాజ్ సింగ్ 2024 ఎన్నికలపై తన బృందంతో సర్వే నిర్వహించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోగా.. మరింత దిగజారిందని సర్వే వెల్లడించింది. దీంతో జగన్ మరోసారి ఎమ్మెల్యేలను పిలిచి క్లాస్ తీసుకోవాలని భావిస్తున్నారట. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేల పనితీరును వారి ముందు పెట్టనున్నట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు తెగ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రెండేళ్ల వ్యవధి ఉండడంతో అటు ఎమ్మెల్యేలను పరుగు పెట్టించడంతో పాటు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయడానికి సీఎం జగన్ నిర్ణయించారు. వ్యతిరేకంగా ఉన్న వర్గాలను దరి చేర్చుకోవాలని భావిస్తున్నారు. ప్లీనరీ సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణుల్లోఆనందం తొణికిసలాడుతోంది. ఇదే స్ఫూర్తిని ఎన్నికల వరకూ నిలపాలని అధినేత యోచిస్తున్నారు. అందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు.
Also Read: Pawan Kalyan BJP: మోదీ పర్యటనకు పవన్ కల్యాణ్ అందుకే పోలేదట..?

అమ్మో.. గడపగడపకు ప్రభుత్వమా?
అయితే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వైసీపీ శ్రేణులు ఆది నుంచి విముఖత చూపుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ బాట తప్పంది. అభివృద్ధి అన్న మాట మరిచిందన్న విమర్శ ఉంది. దీనిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ అప్పులు తెచ్చి మరీ సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు. కానీ గ్రామస్థాయిలో అభివృద్ధి పనులకు మాత్రం మొండిచేయి చూపుతున్నారు. ప్రధానంగా రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు దారుణంగా తయారయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ పనులకు నిదులు కేటాయింపులు లేవు.. మంజూరు లేదు. అటు చేసిన పనులకు సైతం చెల్లింపులు లేవు. దీంతో అభివృద్ధి అనేది ఎక్కడి వేసి గొంగళిలా ఉంది. సంక్షేమంతో సీఎం క్రేజ్ అయితే పెరుగుతుంది తప్ప.. ఎమ్మెల్యేలది మాత్రం మరింతగా దిగజారుతోంది. ఈ పరిస్థితుల్లో గడపగడపకూ కార్యక్రమమంటేవైసీపీ ప్రజాప్రతినిధులు హడలెత్తిపోతున్నారు. కానీ జగన్ మాత్రం ఏంచేస్తారో తెలియదు కానీ.. ప్రజల మధ్యకు వెళ్లకుంటే మాత్రం టిక్కెట్లు కేటాయించేది లేదని స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. తాజాగా వర్కుషాపు నిర్వహిస్తుండడంతో అధినేత నుంచి ఎన్ని చీవాట్లు తినాల్సి వస్తుందేమోనని తెగ బాధపడుతున్నారు.
Also Read:Pawan Kalyan: ఆ తప్పులను విజయానికి మెట్లుగా చేసుకుంటున్న పవన్ కళ్యాణ్