Ram Gopal Varma: సమాజంలో జరిగే ప్రతీ విషయానికి స్పందించే రాంగోపాల్ వర్మ పేరు నిత్యం జనం నోళ్లలో నానుతుంది. రాజకీయంగా, సినీ ఇండస్ట్రీవర్మ హాట్ కామెంట్స్ చేస్తూ వివాదస్పదుడిగా మారుతారు. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఘాటుగా రిప్లై ఇస్తూ అందరి నోళ్లు మూయిస్తారు. కానీ తాజాగా ఆయనకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన తీసిన సినిమా ‘లడ్కీ’ని అన్ని భాషల్లో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా నిర్మాత శేఖర్ రాజు ఇచ్చిన ఫిర్యాదు తో లడ్కీ సినిమా ప్రసారం ఆగిపోయింది. ఇంకకు వర్మకు, శేఖర్ రాజుకు మధ్య విభేదాలు ఎక్కడ వచ్చాయి..?
విభిన్న కథలతో సినిమాలు తీసే ఆర్జీవీ.. ప్రతీ సినిమా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటుంది. అయితే చాలా వరకు యథార్థ ఘటనల ఆధారం చేసుకొని సినిమాలు తీస్తుంటారు వర్మ. ఓ వైపు సినిమాలు తీస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రత్యేకంగా నిలుస్తారు. ఇంతకుముందు ఆయన వరంగల్ రాజకీయ నాయకులు కొండా దంపతులపై సినిమా తీసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత లేడీ బ్రూస్లీ నేపథ్యంలో లడ్కీ పేరుతో సినిమా తీశారు. తెలుగులో దీనికి ‘అమ్మాయి’ అని పేరు పెట్టారు. హిట్టు ఫట్టులతో సంబంధం లేకుండా లో బడ్జెట్ లో సినిమాలు తీస్తారని వర్మకు ప్రత్యేక పేరు ఉంది.
Also Read: Naga Babu And Roja Remuneration: నాగబాబు కంటే రోజాకు ఎక్కువ రెమ్యూనరేషన్.. సంచలన నిజాలు లీక్
సాధారణంగా వర్మ తీసే సినిమాలు కథ పరంగా.. విభిన్న సీన్లతో వివాదాస్పదంగా మారుతాయి. అయినా ఆయన ఏదో రకంగా సినిమాను నడిపించేవారు. కానీ ఇప్పుడే ఏకంగా నిర్మాతే సినిమాను నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. ఇదివరకు శేఖర్ రాజు ‘సాప్ట్ వేర్ సుధీర్’ సినిమాను నిర్మించాడు. తాజాగా లడ్కీ సినిమా కోసం వర్మతో కమిట్మెంట్ అయ్యారు. అయితే వర్మ ఈ సినిమా కోసం లక్షలాది రూపాయలు అడిగితే ఇచ్చానని, అయితే ఆ తరువాత ఆ మొత్తాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని శేఖర్ రాజు ఆరోపించారు.
ఈ విషయంపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా… కోర్టు స్పందించింది. దీంతో ఈ సినిమాను ప్రసారం ఆపాలరి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15న రిలీజైన లడ్కీ తెలుగు, హిందీ, తమిళంలో ఒకేసారి రిలీజ్ అయింది. చైనీస్ నేపథ్యంలో సినిమా కథ ఉండడంతో ఆ భాషలోనూ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు అన్ని భాషల్లోనూ సినిమా ఆగిపోవడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై వర్మ ఏ విధంగా రియాక్టవుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:Nayanthara- Vignesh Shivan: నయనతార – విగ్నేష్ దంపతులపై నెట్ ఫ్లిక్స్ ఫైర్.. భారీ డీల్ క్యాన్సిల్