Ileana: గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ అంటే సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక ప్రేమ. ఎప్పటికిప్పుడు కొత్త భామలు వస్తున్నా.. ఇలియానా పై ప్రేమను మాత్రం సౌత్ జనాలు మర్చిపోలేకపోతున్నారు. ఈ మధ్య ఇలియానా ప్రేమ పై అనేక పుకార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ బ్రదర్ తో ఇలియానా ప్రేమలో ఉందట. కత్రీనా కైఫ్ సోదరుడు ‘సెబాస్టియన్ లారెంట్ మిచెల్’తో ఇలియానా లవ్ ట్రాక్ నడుపుతుందట.
ఈ ఏడాది కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ సెబాస్టియన్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఐతే, ఈ వేడుకల్లో ఇలియానా కూడా కనిపించడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. పైగా సెబాస్టియన్‌తో కలిసి ఇలియానా సందడి చేయడం, దీనికి సంబంధించిన ఫొటోలను కత్రీనా, ఇలియానా తమ ఇన్‌స్టా వేదికగా పంచుకోవడంతో ఈ వార్తకు మరింత బలం తోడైంది.
Also Read: Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్
నిజానికి ఇలియానాకి – సెబాస్టియన్ కి మధ్య ఎక్కడా సినిమాల పరంగా కనెక్షనే లేదు. కాబట్టి.. వీరి మధ్య ఉన్న బంధం వ్యక్తిగతమైనదే. అయినా ‘ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎందుకు పాల్గొంటుంది ?’ అంటూ నెటిజన్లు కూడా చర్చించుకుంటున్నారు. ఎంతైనా ఇలియానా తెలుగులోని స్టార్ హీరోల అందరితోనూ ఆడిపాడింది. కాకపోతే, హిందీ సినిమాల పై మోజు పడి.. తెలుగు ప్రేక్షకులకు హ్యాండ్ ఇచ్చింది.
అయితే, హిందీ ప్రేక్షకులు మాత్రం ‘ఇలియానా’ను బి గ్రేడ్ హీరోయిన్ గానే చూశారు. అక్కడ ఆమె సన్నని నడుము పారలేదు. ఆమె అందాల ఘాటు తనం అక్కడి ప్రేక్షకులకు సరిగ్గా ఎక్కలేదు. దాంతో హిందీలో హిట్ అవ్వకుండానే పేడ్ అవుట్ అయిపోయింది. మధ్యలో బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ అవ్వడం, ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది. దాంతో కొన్నాళ్ళు ఒంటరిగానే గడిపింది.
అయితే, ఓ పార్టీలో ఇలియానాకి, సెబాస్టియన్ తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళు ఇద్దరూ సరదాగా కలుసుకున్నారు. గత 6 నెలలుగా మాత్రం ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు. సెబాస్టియన్ ఇన్‌స్టా అకౌంట్ ను కూడా గత కొంతకాలంగా ఇలియానా ఫాలో అవుతోంది. మొత్తానికి ఆండ్రూ నీబోన్ స్థానాన్ని సెబాస్టియన్ కవర్ చేసినట్టు ఉన్నాడు. మరి, ఇలియానా సెబాస్టియన్ ను అయినా పెళ్లి చేసుకుంటుందా ? చూడాలి.
Also Read:Naga Babu And Roja Remuneration: నాగబాబు కంటే రోజాకు ఎక్కువ రెమ్యూనరేషన్.. సంచలన నిజాలు లీక్