AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మరో రెండేళ్లు అదనంగా ఉద్యోగం చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవనే విషయంలో వారిలో ఆనందం కలుగుతోంది. 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసు కాస్త 62 ఏళ్లకు పెంచుతూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగుల్లో వ్యతిరేకతను తగ్గించుకున్నట్లేనని పలువురు చెబుతున్నారు.
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆసక్తి కర కోణాలు దాగి ఉన్నట్లు విశదమవుతోంది. కొద్ది రోజులుగా ఉద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తితో రగులుతున్నారు. పీఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వంపై ఉద్యోగులకు ఆగ్రహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారిని చల్లబరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కనబడుతోంది. దీంతో ప్రభుత్వంపై ఉన్న మచ్చను తొలగించుకునే క్రమంలోనే ఉద్యోగులకు నజరానా అందించినట్లు తెలుస్తోంది.
Also Read: ఏం మాయ చేశావ్ జగన్.. జీతం కట్ చేసి మరీ ఎలా ఒప్పించావ్.?
రెండేళ్లకు పెంచడంతో ఉద్యోగులకు బతుకుపై భరోసా కల్పించినట్లు అయింది. ఆర్థిక పరిపుష్టికి కూడా దోహదం చేసినట్లే. దీంతో ఉద్యోగులు ప్రభుత్వంపై కోపం కంటే ప్రేమ ఎక్కువగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే జగన్ అన్ని ఆలోచించే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జగన్ తీసుకున్న నిర్ణయం వెనుక పలు విషయాలు దాగి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక మిగిలింది పీఆర్సీ ప్రకటించడమే. ఇందులో కూడా ఉద్యోగులు 27 శాతం అడుగుతుంటే జగన్ మాత్రం అంత మొత్తం ఇవ్వలేమని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వారికి ఏ మాత్రం నష్టం జరగకుండా చూసేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. పీఆర్సీ ప్రకటన కూడా త్వరలో వెలువడనున్నట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా ఏపీ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చినట్లే అని అందరు చర్చించుకుంటున్నారు.
Also Read: హే జగన్.. నీ చుట్టూ డేంజరస్ పీపుల్.. జాగ్రత్తగా ఉండాలన్న వర్మ..