AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్ర స్వరూపమే మారిపోతోంది. ఇన్నాళ్లు ఒకలా ఉన్న చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి లోక్ సభను జిల్లా కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. దీంతో రాష్ర్ట ముఖచిత్రమే మారిపోయింది. ఈ మేరకు వర్చువల్ గా కేబినెట్ సమావేశమై కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆమోదం తెలిపడం తెలిసిందే. దీంతో రాబోయే రోజుల్లో కొత్త జిల్లాల పరిపాలన వ్యవహారాలు కొనసాగించేందుకు ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి.
ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు కానుంది. ఇరవై ఆరు జిల్లాల నుంచి పరిపాలన కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త డివిజన్లు కూడా పని ప్రారంభించనున్నాయి. మండలాల లెక్కలు కూడా తేల్చారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 30 మండలాలు ఉండగా విజయనగరం జిల్లాలో 27 మండలాలతో రెండో స్థానం సంపాదించుకుంది. తక్కువ మండలాలున్న జిల్లాగా విశాఖపట్నం నిలిచింది. కేవలం 11 మండలాలే ఉండటం గమనార్హం.
కోస్తా ప్రాంతంలో చూస్తే కృష్ణ జిల్లా నుంచి నెల్లూరు వరకు ఏడు జిల్లాలుగా విభజించారు. అత్యధిక మండలాలు ఉన్న జిల్లాలుగా ప్రకాశం, నెల్లూరు నిలిచాయి. రెండు మండలాల్లో దాదాు 38 మండలాలు ఉండటం తెలిసిందే. తక్కువ మండలాలున్న జిల్లాగా గుంటూరు గుర్తింపు పొందింది. ఇక్కడ 18 మండలాలే ఉన్నాయి.
రాయలసీమ జిల్లాల్లో అత్యధిక మండలాలున్న జిల్లాగా కడప నిలిచింది. ఇక్కడ 36 మండలాలు ఉన్నాయి. తరువాత స్థానంలో సత్యసాయి జిల్లా 32 మండలాలతో రెండో స్థానంలో ఉంది. తక్కువ మండలాలున్న జిల్లాగా కర్నూలు ఉంది. ఇక్కడ 26 మండలాలే ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రంలోని మండలాల్లో సైతం పరిపాలన పనులు ప్రారంభం కానున్నాయి.
Also Read:Balakrishna New Look: వైరల్ : ఓల్డ్ గెటప్ లో హీరో.. పవర్ ఫుల్ గెటప్ లో విలన్