https://oktelugu.com/

Keerthy Suresh: అక్కడ బాగా ఎంజాయ్ చేశాను అంటున్న కీర్తి సురేష్

Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్స్ లోనే మొదటి వరుస హీరోయిన్. తాజాగా కీర్తి సురేష్ తనలోని చిన్నపిల్లను బయటకు చూపించింది. ఆమె ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూట్ లో పాల్గొంటుంది. అయితే, ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. హీరోయిన్ కీర్తి సురేష్ షూటింగ్ కోసం గోవాలోని లొకేషన్ కి వెళ్లింది అట. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న ఫుడ్ ను ఆర్డర్ చేసిందట. అది తక్కువ ధరకే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 3, 2022 / 05:18 PM IST
    Follow us on

    Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్స్ లోనే మొదటి వరుస హీరోయిన్. తాజాగా కీర్తి సురేష్ తనలోని చిన్నపిల్లను బయటకు చూపించింది. ఆమె ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూట్ లో పాల్గొంటుంది. అయితే, ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. హీరోయిన్ కీర్తి సురేష్ షూటింగ్ కోసం గోవాలోని లొకేషన్ కి వెళ్లింది అట.

    Keerthy Suresh

    అయితే, ఆ ప్రాంతంలో ఉన్న ఫుడ్ ను ఆర్డర్ చేసిందట. అది తక్కువ ధరకే వచ్చింది. దాంతో అమ్మడు తెగ ఆనంద పడిపోతుంది. గోవా బీచ్ కి ఐదు కిలో మీటర్లు దూరంలో ఒక రెస్టారెంట్ ఉంది. దానిలో ఫుడ్ ఎంతో చీప్.. తక్కువ ధరే ఉంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇది సరైన స్థలం. ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను అంటూ కీర్తి చెప్పుకొచ్చింది.

    Also Read:  రోజురోజుకు రేంజ్ ను పెంచుకుంటున్న ‘కృతి శెట్టి’

    మొత్తానికి ఫుడ్ ఎంతో చీప్.. తక్కువ ధర అనగానే కీర్తి సురేష్ బాగా సంతోష పడిందట. మరి హీరోయినే అంత సంతోష పడితే.. ఇక సాధారణ ప్రజలు ఎంత సంతోష పడతారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి అన్నట్టు.. కీర్తి సురేష్ గొప్ప టాలెంట్ ఉన్న నటి. హిట్లు లేకపోయినా చూస్తుండ‌గానే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించేసుకుంది.

    Keerthy Suresh

    సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘సర్కారు వారి పాట’ నుంచి వచ్చిన లవ్ సాంగ్ కళావతి బాగా హిట్ అయ్యింది. ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. ఈ కళావతి సాంగ్‌ యూట్యూబ్‌లో నెం-1గా ట్రెండ్‌ అయ్యింది. మహేష్ సూపర్‌ స్టైలిష్‌ డ్యాన్స్‌తో పాటు కీర్తి సురేష్‌ అభినయాన్ని సినీ అభిమానులు బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు.

    Also Read: హీరోయిన్ ర‌వ‌ళి సినిమాల్లోకి ఎలా వ‌చ్చింది.. ఎందుకు మానేసింది.. ఇప్పుడు ఏం చేస్తుంది..?

    Recommended Video:

    Tags