https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ: నాగార్జున నోటినుంచి బూతు.. కంటెస్టెంట్స్ షాక్

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ షోతో నాగార్జున అందరికి షాక్ లు ఇస్తున్నారు. తన షోలో అద్భుతమైన హోస్టింగులతో అందరిని ఆకట్టుకుంటున్నారు. కంటెస్టెంట్స్ ను సైతం కంగారు పెడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఎపిసోడ్ కు ఎపిసోడ్ కు మధ్య ఏవో ట్రెండింగ్ లు తెస్తూ అందరిలో ఉత్కంఠ రేపుతున్నారు. ఉాగాది రోజున బృందావనంలో కృష్ణుడు వచ్చాడే అనే పాటతో అందరిలో ఆతృత నింపారు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్సాహంగా కనిపించారు. అభిమానులకు షాక్ లు […]

Written By: , Updated On : April 3, 2022 / 06:09 PM IST
Follow us on

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ షోతో నాగార్జున అందరికి షాక్ లు ఇస్తున్నారు. తన షోలో అద్భుతమైన హోస్టింగులతో అందరిని ఆకట్టుకుంటున్నారు. కంటెస్టెంట్స్ ను సైతం కంగారు పెడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఎపిసోడ్ కు ఎపిసోడ్ కు మధ్య ఏవో ట్రెండింగ్ లు తెస్తూ అందరిలో ఉత్కంఠ రేపుతున్నారు. ఉాగాది రోజున బృందావనంలో కృష్ణుడు వచ్చాడే అనే పాటతో అందరిలో ఆతృత నింపారు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్సాహంగా కనిపించారు. అభిమానులకు షాక్ లు ఇవ్వడమే ఆయనకు అలవాటుగా మారింది.

Bigg Boss Telugu OTT

Bigg Boss Telugu OTT

అషురెడ్డి ఆట తొక్క.. తోటకూరా అంటూ వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కంటెస్టెంట్లతో పాటు అభిమానులను కూడా ఉర్రూతలూగిస్తున్నారు. తనదైన శైలిలో బిగ్ బాస్ వేదికగా ఆట ఆడుకుంటున్నారు. నటరాజ్ మాస్టారును కూడా ఓ ఆట ఆడుకున్నారు. ఆయనలా నడుస్తూ అందరిని నవ్వించారు. యాంకర్ శివ మీద కూడా ఏవో జోకులు వేస్తూ సందడి చేశారు. దీంతో బిగ్ బాస్ షో పై అందరికి ఆసక్తి పెరుగుతోంది.

Also Read: AP New Districts: కొత్త జిల్లాలతో ఏపీ రూపురేఖలు మారుతున్నాయా?

బిందుమాధవిపై కూడా కామెడీ చేశారు. ఆమె నమస్కారం పెట్టే దాన్ని అనుకరిస్తూ అందరిలో నవ్వులు పూయించారు. ఆమె కూడా దానిపై ఏం అనలేదు. దీంతో బిగ్ బాస్ షో మొత్తం నాగార్జున కనుసన్నల్లోనే నడుస్తోందని తెలుస్తోంది. సెలబ్రిటీలతో పాటు అందరిని ఆకట్టుకునేలా జోకులు పేలుస్తూ తనస్టైల్ లో నడిపిస్తున్నారు.

Bigg Boss Telugu OTT

Bigg Boss Telugu OTT

యాంకర్ శివ, ముమైత్ ఖాన్ లను కూడా తనదైన యాసలో అనుకరిస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. అందరి మీద సెటైర్లు వేస్తున్నారు. ముమైత్ ఖాన్ కు భాష రాదని సెటైర్ వేశారు. శివ గురించి కూడా తాను 1989లో తీసిన శివ చిత్రం గురించి ముచ్చటించారు. మొత్తానికి బిగ్ బాస్ షో లో నాగార్జున అందరిని టార్గెట్ చేసుకుని జోకులు వేయడం సాధారణమైపోయింది. అజయ్ ని ఉద్దేశిస్తూ వ్యాట్ ద ఎఫ్ గేమ్ అంటూ మాట తూలారు. దీంతో అజయ్ షో నుంచి వెళ్లిపోవాలని ఉందా అంటూ మరో సెటైర్ పేల్చారు. దీంతో బిగ్ బాస్ షోలో నాగార్జున వేస్తున్న సెటైర్లకు అందరు నొచ్చుకుంటున్నట్లు వారి మదిలో ఉన్న అభిప్రాయం.

Also Read:Pakistan National Assembly Dissolved: జాతీయ అసెంబ్లీ రద్దు.. ఎన్నికలకు వెళుతున్న ఇమ్రాన్ ఖాన్.. ప్రతిపక్షాలకు షాక్

Tags