AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై అందరిలో ఆశలు పెరుగుతున్నాయి. ఆశావహుల సంఖ్య కూడా రెట్టింపవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణపై నే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య నానాటికి ఎక్కువవుతోంది. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారంలోనే జగన్ చెప్పేశారు. రెండున్నరేళ్ల తరువాత మంత్రి వర్గం మొత్తం మార్చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా పదవి సాధించాలని అందరు ప్రయత్నాలు ఆరంభించారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు(మాడుగుల)కు ఈ సారి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ కోటాలో మరో ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.

అధినేత మెప్పు కోసం పాకులాడుతున్నారు. ఆయన దృష్టిలో పడి పదవి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఇక విశాఖ పట్నం విషయానికి వస్తే ప్రస్తుతం మంత్రిగా ఉన్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్థానంలో ఎవరిని మంత్రి పదవి వర్తిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రివర్గ మార్పుపై చర్చ జరుగుతోంది. కొత్త వారికి మంత్రి పదవి దక్కవచ్చని తెలుస్తోంది.
అక్టోబర్ 30న బద్వేల్ ఉప ఎన్నిక ఉండటంతో నవంబర్ లో మంత్రి వర్గ విస్తరణ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రుల పనితీరు సమీక్షించి తరువాత పునర్య్యవస్తీకరణపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే జగన్ మదిలో మంత్రుల జాబితా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా మంత్రివర్గ విస్తరణపై అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇప్పటికే పలువురు సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు. కానీ జగన్ మదిలో ఎవరున్నారో అర్థం కావడం లేదు. ఆయన కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు. తాను అనుకున్నది చేశాక కానీ తెలియదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న వారి కలలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే.