Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో జనసేన జోరు పెంచింది. పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇతర పార్టీ ల నుంచి ముఖ్య నేతల్ని రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజాక్షేత్రంలోనే పార్టీని నిలపాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పలు మార్గాలు అన్వేషిస్తోంది. పార్టీ బలోపేతం దిశగా ఆలోచనలు చేస్తోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా ఇక మేల్కోవాలని భావిస్తోంది. అన్ని కులాల సమాహారంగా పార్టీని నిలపాలని ప్రయత్నాలు ఆరంభించింది.

ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కారంలో మాకు సైతం బాధ్యత ఉందని రోడ్ల మరమ్మతుపై దృష్టి పెట్టిన జనసేన ఇక ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. పవన్ కల్యాణ్ పార్టీని ఏపీలో దశదిశలా వ్యాపింపజేయాలని భావిస్తున్నారు. దీని కోసం అనువైన విధంగా ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేతల సహకారంతో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని చూస్తున్నారు.
ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు, ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో మంచి పట్టున్న ఆయన రాకతో పార్టీ బలోపేతం అవుతుందని భావించి ఆయనను ఎలాగైనా తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
జనసేన భవిష్యత్ దృష్ట్యా పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీ ఎదుగుదలకు పలు మార్గాలు వెతుకుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే పనిలో పడ్డారు. సామాజిక వర్గాలే ఎజెండాగా పార్టీని ప్రక్షాళన చేయనున్నారు. కీలక నేతల రాకతో పార్టీలో జోష్ పెరిగి మంచి విజయాలు అందుకునే వీలుందని ఆలోచిస్తున్నారు. ఏదిఏమైనా ఈసారి మాత్రం గెలుపు తీరం చేరాల్సిందేనని పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.