AP Cabinet Meeting: ఆ రోజే ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం.. బ‌డ్జెట్‌లో ఆ రంగాల‌కే అధిక కేటాయింపులు..!

AP Cabinet Meeting: వ‌చ్చే నెల మార్చి మొద‌టి వారంలో ఏపీలో బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అలెర్ట్ అయింది. బ‌డ్జెట్ స‌మావేశాల్లో చ‌ర్చించాల్సిన అంశాలు, ప్ర‌శే పెట్టాల్సిన బ‌ల్లులు, ఏ రంగానికి ఎంత కేటాయించాలి లాంటి అనేక అంశాల‌పై మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఇందులో అనేక అంశాల‌పై కూలంకుశంగా జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న మంత్రులు చ‌ర్చించ‌నున్నారు. మార్చి 3న స‌చివాల‌యంలో జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈ మంత్రివ‌ర్గ స‌మావేశం ఉండ‌నుంది. ఇందులో మంత్రి మేక‌పాటి […]

Written By: Mallesh, Updated On : February 27, 2022 11:44 am
Follow us on

AP Cabinet Meeting: వ‌చ్చే నెల మార్చి మొద‌టి వారంలో ఏపీలో బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అలెర్ట్ అయింది. బ‌డ్జెట్ స‌మావేశాల్లో చ‌ర్చించాల్సిన అంశాలు, ప్ర‌శే పెట్టాల్సిన బ‌ల్లులు, ఏ రంగానికి ఎంత కేటాయించాలి లాంటి అనేక అంశాల‌పై మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఇందులో అనేక అంశాల‌పై కూలంకుశంగా జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న మంత్రులు చ‌ర్చించ‌నున్నారు.

AP Cabinet Meeting

మార్చి 3న స‌చివాల‌యంలో జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈ మంత్రివ‌ర్గ స‌మావేశం ఉండ‌నుంది. ఇందులో మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డికి నివాళి అర్పించిన త‌ర్వాత ఆయ‌న నిర్వ‌హించిన శాఖ‌ను తాత్కాళికంగా ఎవ‌రికి అప్ప‌గించాలో కూడా ఇందులోనే నిర్ణ‌యిస్తారు. అయితే ఈ సారి బ‌డ్జెట్ లో స్కూల్లు, ఆస్ప‌త్రులు, వ్య‌వ‌సాయ రంగానికి అధికంగా కేటాయించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

బ‌డ్జెట్‌ను దాదాపు రూ.2.40ల‌క్ష‌ల కోట్ల‌తో ప్ర‌వేశ పెట్టనున్న‌ట్టు స‌మాచారం. ఇందులో ముఖ్యంగా నాడు-నేడు, జగనన్న విద్యా దీవెన, అమ్మ‌వొడి లాంటి సంక్షేమ స్కీముల‌కే అధిక ప్రాధాన్య ఇస్తార‌ని తెలుస్తోంది. అయితే నాడు-నేడుతో స్కూళ్ల‌లో మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. త్వ‌ర‌లోనే ఆస్ప‌త్రుల‌లో కూడా నాడు-నేడు స్కీమ్ ద్వారా మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు ఈ బ‌డ్జెట్‌లో కేటాయింపులు జ‌రిపే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Also Read: బయ్యారం కోసం తెలంగాణ సర్కార్ ఉద్యమం
గ‌తంలో స్కూళ్ల కోసం నాడు-నేడు ప‌థ‌కానికి రూ.6వేల కోట్లు కేటాయించిన ప్ర‌భుత్వం.. ఈ సారి కూడా అంతే స్థాయిలో కేటాయించ‌నుంది. ఇక రైతు భరోసా పథకానికి కూడా పెద్దపీట వేయ‌నున్నారు. వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు అధికంగా కేటాయింపులు ఉండ‌నున్నాయి. ఇక జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న మూడు రాజధానుల కొత్త బిల్లు మీద కూడా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.

మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ కొత్త బిల్లుల‌పై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అన్ని కుదిరితే ఈ స‌మావేశాల్లోనే రాజధానుల బిల్లు వ‌చ్చేలా ఉంది. ఒక‌వేళ టెక్నిక‌ల్ గా ఏమైనా స‌మ‌స్య‌లు వ‌స్తే మాత్రం వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఈ బిల్లును తీసుకు రావ‌చ్చు. ఇక మంత్రి వ‌ర్గ మీటింగ్‌లో బ‌డ్జెట్ స‌మావేశాలు ఎన్ని రోజులు నిర్వ‌హించాలో తేదీల‌ను కూడా నిర్ణ‌యించ‌నున్నారు.

Also Read: పవన్‌ పై కక్ష సాధిస్తుంటే.. ఏ హీరో నోరు మెదపడం లేదు – నాగబాబు

Tags