https://oktelugu.com/

Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఇప్పుడంతా కొత్త చిత్రాల హడావుడి నడుస్తోంది. ఈక్రమంలో తెలుగులో పుష్ప విజయాన్ని ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ, హిందీలో పది వారాలైనా పుష్ప స్టేటస్ అదిరిపోతోంది. హిందీ బెల్ట్‌లో పుష్ప ఇటీవలే 10 వారాలు పూర్తి చేసుకుంది. గత 20 ఏళ్లలో తన కెరీర్‌లో ఇలాంటి చిత్ర విజయాన్ని చూడలేదని పుష్పను డిస్ట్రిబ్యూట్‌ చేసిన ప్రముఖ ఎగ్జిబిటర్‌ పీయూష్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 27, 2022 / 11:52 AM IST
    Follow us on

    Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఇప్పుడంతా కొత్త చిత్రాల హడావుడి నడుస్తోంది. ఈక్రమంలో తెలుగులో పుష్ప విజయాన్ని ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ, హిందీలో పది వారాలైనా పుష్ప స్టేటస్ అదిరిపోతోంది. హిందీ బెల్ట్‌లో పుష్ప ఇటీవలే 10 వారాలు పూర్తి చేసుకుంది. గత 20 ఏళ్లలో తన కెరీర్‌లో ఇలాంటి చిత్ర విజయాన్ని చూడలేదని పుష్పను డిస్ట్రిబ్యూట్‌ చేసిన ప్రముఖ ఎగ్జిబిటర్‌ పీయూష్‌ జైన్ ట్విట్టర్‌లో తెలిపారు.

    Pushpa

    మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ఏ మాయ చేసావే చిత్రం విడుదలై నేటితో 12ఏళ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా దీనిపై స‌మంత భావోద్వేగ‌భరితంగా పోస్ట్ చేసింది. ‘లైట్స్‌, కెమెరా, యాక్ష‌న్‌.. 12ఏళ్ల జ్ఞాప‌కాలు, అనుభ‌వాలు గుర్తుకువ‌స్తున్నాయి. ఈ ప్ర‌యాణం, ప్ర‌పంచంలోనే అత్యంత విధేయ‌త ఉన్న‌ అభిమానులను ఇచ్చినందుకు భ‌గ‌వంతుడికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాను.. అవి వేటికీ సరిపోలని క్షణాలు’ అని స‌మంత పేర్కొంది. ఈ పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.

    Samantha

    ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ యూట్యూబ్‌లో తన హిందీ డబ్బింగ్ చిత్రాల ద్వారా హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. యూట్యూబ్‌లో నితిన్ హిందీ డబ్బింగ్ చిత్రాలన్నిటికి కలిపి 2.3 బిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఈ ఘనత సాధించిన మొదటి మరియు ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్.

    Also Read: కంగనా రనౌత్ ‘లాక్ అప్ షో’ కి షాక్ !

    Nithin

    అయితే నితిన్ తెలుగులో చేసిన సినిమాలన్నీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం భారీ మొత్తాలను వసూలు చేయడంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. మొత్తానికి నితిన్ స్టార్ హీరోగా తన స్థాయిని పెంచుకోలేకపోయినా.. తన గుర్తింపును మాత్రం బాగానే ఎలివేట్ చేసుకున్నాడు.

    Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !

    Tags