https://oktelugu.com/

Kangana Ranaut Lock Upp Show: కంగనా రనౌత్ ‘లాక్ అప్ షో’ కి షాక్ !

Kangana Ranaut Lock Upp Show: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాక్ అప్’ రియాలిటీ షోకి సిద్ధమవుతున్నారు. బిగ్ బాస్ షోని పోలిన లాక్ అప్ షో సరికొత్తగా రూపొందించారు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో విరామం లేకుండా నిరంతరం ఈ షో ప్రసారం కానుంది. అయితే, కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ లాక్ అప్ షో ప్రసారం నిలిపి వేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. […]

Written By:
  • Shiva
  • , Updated On : February 27, 2022 / 11:23 AM IST
    Follow us on

    Kangana Ranaut Lock Upp Show: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాక్ అప్’ రియాలిటీ షోకి సిద్ధమవుతున్నారు. బిగ్ బాస్ షోని పోలిన లాక్ అప్ షో సరికొత్తగా రూపొందించారు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో విరామం లేకుండా నిరంతరం ఈ షో ప్రసారం కానుంది. అయితే, కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ లాక్ అప్ షో ప్రసారం నిలిపి వేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

    Kangana Ranaut Lock Upp Show

    షో కాన్సెప్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సనోబర్ బేగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సిటీ సివిల్ కోర్టు.. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో షో ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ షో ఆల్ట్ బాలాజీ అనే ఓటీటీ‌లో 27న ప్రసారం కావాల్సి ఉంది. ఇక హోస్ట్ కంగనా, నిర్మాత ఏక్తా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

    లాక్ అప్ షోలో మీరు ఎవరిని లాక్ చేయాలని కోరుకుంటున్నారు? అని అడుగగా… దర్శక నిర్మాత కరణ్ జోహార్ పేరు చెప్పారు కంగనా. నా జైలులో నా బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహార్ ని బంధించాలని అనుకుంటున్నానని సమాధానం చెప్పారు. కంగనా ఇంకా మాట్లాడుతూ ఇలాంటి ఆసక్తికరమైన, ఉత్కంఠరేపే షోని హోస్ట్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను.

    Also Read: పవన్‌ పై కక్ష సాధిస్తుంటే.. ఏ హీరో నోరు మెదపడం లేదు – నాగబాబు

    లాక్ అప్ రియాలిటీ షోతో అది కుదిరింది అన్నారు. లాక్ అప్ షో కాన్సెప్ట్ నాకెంతగానో నచ్చింది. ఏక్తా కపూర్ షోని అద్భుతంగా రూపొందించారు. అందుకే ఈ షోకి హోస్ట్ బాధ్యతలు తీసుకున్నాను, అన్నారు. ఇక అమితాబ్, సల్మాన్ వంటి స్టార్స్ ఇప్పటికే పాప్యులర్ రియాలిటీ షోలు చేశారు, వారి నుండి మీరు స్ఫూర్తి పొందుతారా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కంగనా… నేను ఎవరిని స్ఫూర్తిగా తీసుకోను.

    అది కూడా ఒక రియాలిటీ షోకి వేరొకరిని అనుకరించకూడదు. మనం మనలాగే ఉండాలి. ఒకరిని అనుకరించడం, స్ఫూర్తిగా తీసుకోవడం నాకు గౌరవం కాదన్నారు. రియాలిటీ షో అనగానే ఇలాంటి పోలికలు సర్వసాధారణం. కానీ మా షోని సరికొత్తగా రూపొందించాము. ఇక లాక్ అప్ షో హోస్ట్ గా నా ఫస్ట్ ఛాయిస్ కంగనానే. అందుకే ఆమెను తీసుకోవడం జరిగింది, అన్నారు.

    Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !

    Tags