AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై అందరిలో సందేహాలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన మంత్రివర్గం సందర్భంగా జగన్ రెండున్నరేళ్ల వరకే ఉంటారని చెప్పినా అది ఆచరణలో కనిపించడం లేదు. దీంతో ఆశావహుల్లో ఆందోళన కలుగుతోంది. అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడతారనే పేరున్నా అది ఎక్కడ కూడా కనిపించడం లేదు.

ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణపై ఊసే లేకుండా పోవడం గమనార్హం. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి. తొలి విడతలో అధికారం దక్కని వారు తరువాత విస్తరణలోనైనా తమకు అవకాశం దక్కుతుందని భావించినా వారి ఆశలు మాత్రం తీరేలా కనిపించడం లేదు. దీంతో వారంతా నైరాశ్యంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Theaters VS AP Govt: ఏపీలో థియేటర్లు పూర్తిగా మూతపడిపోనున్నాయా?
దీపావళికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగినా అది నెరవేరలేదు. తరువాత జగన్ జన్మదినం సందర్భంగా ఉంటుందని చెప్పనా అది కూడా కనిపించలేదు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగను సాకుగా చూపుతున్నా అది కూడా తీరేలా లేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ అప్పుడే తీరేలా కనిపించడం లేదని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ చేపడితే పదవులు దక్కని వారిలో ఆగ్రహం పెరుగుతుందని భావించే ఆ దిశగా అడుగులు వేయడం లేదనే వాదనలు వస్తున్నాయి.
అసలు జగన్ మనసులో ఏముందో అంతుచిక్కడం లేదు. అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనే అనుమానం అందరిలో వస్తోంది. ఎవరికైనా దర్జాగా బుగ్గ కారులో తిరగాలని ఉండదా? దీంతో వారి ఆశలు మాత్రం నెరవేరేలా పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ప్రతిసారి వాయిదా పడుతుండటతో నేతల్లో అసహనం పెరుగుతోంది. జగన్ మంత్రివర్గ విస్తరణ ఎప్పటికి చేపడతారో కూడా తెలియడం లేదని తెలుస్తోంది.
Also Read: CM Jagan Mohan Reddy: ఉద్యోగులు జర జాగ్రత్త.. అక్కడున్నది జగన్