https://oktelugu.com/

Amaravathi BJP: బీజేపీ సంచలనం.. ఏపీ మూడు రాజధానులకు వ్యతిరేకం.. పాదయాత్రకు సోము వీర్రాజు

Amaravathi BJP: ఏపీ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ మూడు రాజధానులపై కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేసింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు, ఆందోళనలకు బీజేపీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనడానికి రెడీ అయ్యింది. Also Read: బీజేపీ బ్యాక్ స్టెప్ వేయ‌డం ఇది ఎన్నో సారి ? ఇక అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2021 1:20 pm
    Follow us on

    Amaravathi BJP: ఏపీ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ మూడు రాజధానులపై కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేసింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు, ఆందోళనలకు బీజేపీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనడానికి రెడీ అయ్యింది.

    Also Read: బీజేపీ బ్యాక్ స్టెప్ వేయ‌డం ఇది ఎన్నో సారి ?

    watchout-ap-bjp-continue-to-suspend-even-main-party-leaders-on-burning-issue-of-amaravathi_0_20-08-11-10-08-07

    watchout-ap-bjp-continue-to-suspend-even-main-party-leaders-on-burning-issue-of-amaravathi_0_20-08-11-10-08-07

    ఇక అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జగన్ సర్కార్ పై ఒత్తిడిని తీసుకొచ్చేలా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తీసుకొని రానుంది. అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ పాల్గొననుంది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. ఇన్నాళ్లు స్టాండ్ తీసుకోని బీజేపీ ఇప్పుడు క్లియర్ కట్ గా మూడు రాజధానులకు వ్యతిరేకమని ప్రకటించడం.. పాదయాత్రకు పూనుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

    ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్రమాజీ మంత్రి పురంధేశ్వరి, నేతలు సత్యకుమార్, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, కన్నా లక్ష్మీనారాయణలు సోమవారం నెల్లూరు జిల్లా కావాలిలో అమరావతి రైతుల పాతయాత్రతో కలిసి సాగుతారు. ఈ పాదయాత్రను తెలుగు దేశం పార్టీ సారథ్యం వహిస్తోంది. చంద్రబాబు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా తోడు రావడంతో ఈ ఉద్యమానికి మరింత ఊపు వచ్చింది. టీడీపీ, బీజేపీ సాన్నిహిత్యానికి దారిపడినట్టైంది. బీజేపీ జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. దీంతో మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకం అనే సందేశాన్ని పంపించినట్టవుతోంది.

    ఇటీవల కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించి బీజేపీ నేతలకు హితబోధ చేశారు. వారికి దిశానిర్ధేశం చేశారు. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉండాలని.. మూడు రాజధానులను వ్యతిరేకించాలని డిసైడ్ అయ్యారు.దీంతో ఏపీ బీజేపీ ఇక క్లియర్ కట్ గా అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని స్టాండ్ తీసుకున్నట్టైంది.

    Also Read: ధాన్యం కొనుగోలుపై స్ప‌ష్ట‌తనిచ్చిన కేంద్రం.. సెల్ఫ్ డిఫెన్స్‌లో స్టేట్ బీజేపీ..