Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు చిరు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. కాగా, మరోవైపు, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్ సినిమా చేస్తున్నారు. మలయాళంలో హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు ఈ సినిమా రీమేక్. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దీంతో పాటు, భోళాశంకర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. వీటి తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, ఇదే జోరుతో మరో కొత్త సినిమాకు కూడాా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఛలో, భీష్మా వంటి విభిన్న కథాంశమున్న చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే వెంకీ చిరుకు కథ వినిపించగా.. చిరుకు కథ బాగా నచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కాగా, చిరు ప్రస్తుతం నటిస్తున్న ఆచార్యలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే రామ్‌చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో చిరు, చరణ్ మవోయిస్టులుగా కనిపించనుండటం విశేషం. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కానుంది.