Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఇందులో రష్మికా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్ క్యారెక్టర్లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

అయితే, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లేనేమో మైత్రీ మూవీ మేకర్స్ హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్ యూట్యూబ్ ఛానెల్‌కు విక్రయించింది. అయితే, ఆ తర్వాత సుకుమార్, ఈ ఆలోచన మార్చుకుని.. పుష్పను పాన్ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో పుష్ప సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించింది. అప్పుడే, మైత్రి, గోల్డ్ మైన్స్ మధ్య వివాదం తలెత్తింది. మధ్యలో నిర్మాతలకు సమస్యలు ఎదురైనా.. సామరస్యంగా పరుష్కరించారు.
దీంతో, పుష్ప హిందీ హక్కులను ఏఏ పిల్మ్స్ దక్కించుకుంది. గతంలో బాహుబలి, ‘కేజీఎఫ్’ వంటి భారీ సినిమాలను ఏఏ ఫిల్మ్స్ హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, మిగిలిన భాషల్లోనూ పుష్ప డిస్ట్రిబ్యూటర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఈ4 ఎంటర్టైన్మెంట్ సంస్థ మలయాళంలో, తమిళంలో లైకా ప్రొడభన్స్, కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్, ఎవర్సీస్లో హంసినీ ఇంలా అన్ని చోట్ల పుష్పను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పుష్ప బృందం భారీగానే ప్రమోషన్స్ ప్లాన్స్ చేస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తొలి పార్ట్ డిసెంబరు 17న విడుదల కానుంది.