https://oktelugu.com/

ఏపీ సమస్యలపై ఢిల్లీకి సోమువీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ బాట పట్టారు. మూడు రోజుల కీలక పర్యటన నిమిత్తం ఆయన బయలుదేరి వెళుతున్నారు. రేపు ఉదయం ఢిల్లీ’బయలుదేరనున్న సోము వీర్రాజు నేతృత్వంలోని రాష్ట్ర నేతలు అక్కడ కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలను కలుస్తారు. విజయవాడ విమానాశ్రయం నుంచి రేపు ఉదయం ఢిల్లీకి ఏపీ బీజేపీ నేతలు పయనమవుతారు. ఈ పర్యటనలో సోము వీర్రాజు బృందం.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలసి ఏపీ ఆర్ధిక […]

Written By:
  • NARESH
  • , Updated On : August 2, 2021 10:38 pm
    Follow us on

    ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ బాట పట్టారు. మూడు రోజుల కీలక పర్యటన నిమిత్తం ఆయన బయలుదేరి వెళుతున్నారు. రేపు ఉదయం ఢిల్లీ’బయలుదేరనున్న సోము వీర్రాజు నేతృత్వంలోని రాష్ట్ర నేతలు అక్కడ కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలను కలుస్తారు.

    విజయవాడ విమానాశ్రయం నుంచి రేపు ఉదయం ఢిల్లీకి ఏపీ బీజేపీ నేతలు పయనమవుతారు. ఈ పర్యటనలో సోము వీర్రాజు బృందం.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలసి ఏపీ ఆర్ధిక పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. రోజురోజుకు దిగజారుతున్న ఏపీ ఆర్థిక స్థితిపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే చేపట్టకపోతే ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

    కేంద్ర జలశక్తి శాఖా మంత్రి శ్రీ గజేంద్ర షేకావత్’ తో భేటీ కానున్న శ్రీ సోము వీర్రాజు బృందం. పోలవరం ప్రాజెక్టు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ప్రాజెక్టు కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చర్చించనున్నారు. రైల్వే శాఖామంత్రి  అశ్వని వైష్ణవితో తర్వాత భేటీ కానున్నారు.

    ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు అంశాలపై కూడా కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.  విశాఖ రైల్వే జోన్ అభివృద్ధి అంశాలు చర్చించనున్నారు. కేంద్ర రైల్వే శాఖ ఆమోదం పొంది, నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించని అంశాలు, కొత్త రైల్వే లైను.. కొవ్వూరు – భద్రాచలం అంశంపై రైల్వే మంత్రి దృష్టికి బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీసుకురానున్నారు.

    కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్’ను సోము వీర్రాజు కలవనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ఎగుమతులు అంశాలను మంత్రి దృష్టికి తీసుకురానున్నారు.

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  సోము వీర్రాజు భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు,పార్టీ విస్తరణ, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై సోము వీర్రాజు నివేదించనున్నారు.