బండి సంజయ్ పాదయాత్ర వాయిదా..అసలు కారణమిదీ!

తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నిర్ణయానికి తాత్కాలిక బ్రేక్ పడింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఈ పాదయాత్రకు ప్లాన్ చేసింది. పాదయాత్ర ద్వారా జనాల్లో ఆదరణ పెంచుకొని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణుల్లో ఊపు తెచ్చేలా బండి సంజయ్ పాదయాత్రకు నడుం బిగించారు. తెలంగాణ అంతటా […]

Written By: NARESH, Updated On : August 2, 2021 10:54 pm
Follow us on

తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నిర్ణయానికి తాత్కాలిక బ్రేక్ పడింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఈ పాదయాత్రకు ప్లాన్ చేసింది. పాదయాత్ర ద్వారా జనాల్లో ఆదరణ పెంచుకొని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణుల్లో ఊపు తెచ్చేలా బండి సంజయ్ పాదయాత్రకు నడుం బిగించారు.

తెలంగాణ అంతటా ప్రజలతో మమేకం అవుతూ.. సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా పడింది.

తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేస్తున్నట్టు బండి సంజయ ప్రకటించారు.

పార్లమెంట్ కు బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేయడం.. మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో బండి సంజయ పాదయాత్ర వాయిదా పడింది.

అయితే ఈనెలలో బండి సంజయ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈణెల 24వ తేదీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నట్టు బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.