Rajamouli Crazy Comments On NTR – Charan: ‘ఆర్ఆర్ఆర్’ విడుదల ముహూర్తం దగ్గర పడుతుంది. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాదిమంది సినీ అభిమానులు తరలి వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడిన మాటలు.. ఎన్టీఆర్ – చరణ్ అభిమానులకు ఫుల్ కిక్ ను ఇస్తున్నాయి.
“నా రాముడు .. నా భీముడు..’ అంటూ హీరోల గురించి చెప్పడం మొదలు పెట్టిన రాజమౌళి ఎమోషనల్ అవుతూ.. ‘నేను అడిగిన వెంటనే కథ ఏమిటి ? అసలేం చేస్తున్నారు ? ఎలా తీస్తున్నారు ? అని నన్ను ఏమీ అడక్కుండానే.. హీరోలిద్దరూ తమ శరీరంలోని ప్రతి అణువును ఈ సినిమా కోసం పెట్టారు. అందుకే, రామ్ చరణ్ కి, తారక్ కి ప్రత్యేక థ్యాంక్స్ చెబుతున్నాను.
Also Read: బిగ్ బాస్ ఓటీటీలో ఉన్న అలకరాజా అఖిల్.. ఢీ షోలో ఇంకా ఎందుకు కనిపిస్తున్నట్టు? ఎలా సాధ్యం?
చిరంజీవిగారు చరణ్ కి రామ్ చరణ్ అని ఎందుకు పెట్టారో తెలియదు, రామ్ చరణ్ అంటే.. ఆంజనేయస్వామి. నిజంగానే చరణ్ ఆంజనేయస్వామి లాంటి స్వభావం ఉన్న వ్యక్తే. తన బలం, బలగం ఏమిటో తనకే తెలియని వ్యక్తి చరణ్. తనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, తన కోసం వాళ్ళు ఎంతగా పడి చచ్చిపోతారో కూడా చరణ్ కి తెలియదు.
చరణ్ కి తన బలం గురించి, తన వెనకాల ఉన్న బలగం గురించి చెప్పాలి. ఆంజనేయస్వామికి కూడా తన గొప్పతనాన్ని చెబితే వెంటనే.. వంద యోజనాల సముద్రాన్ని ఒక్క గెంతులో దాటేశాడు. చరణ్ కూడా అలాంటివాడే.
అలాగే నందమూరి హరికృష్ణ గారు.. ఎన్టీఆర్ కి ఎందుకు తారకరామ్ అని పేరు పెట్టారో తెలియదు. రాముడు సత్య వాక్య పరిపాలకుడు, పితృవాక్య పరిపాలకుడు, ఓన్లీ వన్ వైఫ్. ఇక్కడా అంతే.. ఓన్లీ ప్రణతి. అలాగే తన శక్తి ఏమిటో తనకి బాగా తెలిసిన మహనీయుడు రాముడు. సేమ్ అలాగే తారక్ కూడా. తన శక్తి ఏమిటో తనకి తెలిసిన యాక్టర్ ఎన్టీఆర్. తన బలం తనకు తెలుసు. తాను ఏం చేయగలడో తనకు తెలుసు.
అలాంటి ఎన్టీఆర్ నా భీముడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చరణ్ గొప్ప నటుడు .. ఆ విషయం తనకి తెలియదు. ఎన్టీఆర్ గొప్ప నటుడు ఆ విషయం తనకి తెలుసు. ఇలాంటి ఇద్దరు గొప్ప నటులు నా సినిమాలో చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఐయామ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతానికి అయితే, అన్ని సినీ పరిశ్రమల్లో ఈ మూవీ మేనియా కమ్మేసింది.
Also Read: ‘కార్తీకదీపం’ సౌర్యగా వచ్చిన ఈ అందాల ‘అమూల్య’ ఎవరో తెలుసా?